ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్‌పాయిజన్!
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో హాస్టల్ విద్యార్థినులు అస్వస్థతతకు గురైన ఘటన కలకలం రేపింది. జోగిపేటలోని ఎస్సీ బాలికల హాస్టల్లో 80మంది విద్యార్థినులు ఉండగా, వారం తా బుధవారం ఉదయం భోజనం చేసి కళాశాలకు వెళ్లారు. అక్కడ ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కళాశాల సిబ్బంది వారిని జోగిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, హాస్టల్, దవాఖానకు వద్దకు చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
- ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దవాఖాన వద్ద తల్లిదండ్రుల ఆందోళన
- వైద్యారోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలో ఘటన
అందోల్, నవంబర్ 25 : సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో హాస్టల్ విద్యార్థినులు అస్వస్థతతకు గురైన ఘటన కలకలం రేపింది. జోగిపేటలోని ఎస్సీ బాలికల హాస్టల్లో 80మంది విద్యార్థినులు ఉండగా, వారం తా బుధవారం ఉదయం భోజనం చేసి కళాశాలకు వెళ్లారు. అక్కడ ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కళాశాల సిబ్బంది వారిని జోగిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, హాస్టల్, దవాఖానకు వద్దకు చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
వార్డెన్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చే శారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే వసతి గృహాల పరిస్థితి ఇలావుంటే, మిగతాచోట్ల ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తంచేశారు. సిబ్బంది పిల్లలను లోపలపెట్టి తాళాలు వేసి, మిగిలిపోయిన అన్నాన్ని డస్ట్‌బిన్‌లో వేశారు. తహసీల్దార్ సాగర్ మధుకర్‌రెడ్డి, ఎస్సై శ్రీకాంత్ హాస్టల్‌కు వెళ్లగా అప్పుడు తాళాలు తీశారు. విద్యార్థినులు మాట్లాడుతూ.. వసతి గృహంలో కొద్ది రోజులుగా పురుగులు పట్టిన బియ్యంతో అన్నం వడ్డిస్తున్నారని, టిఫిన్లోనూ పురుగులు వస్తున్నట్టు తెలిపారు. ఈ విషయమై వార్డెన్, సిబ్బందిని అడిగితే బెదిరిస్తున్నారని కన్నీ ళ్లు పెట్టుకున్నారు. ఆర్డీవో రమేశ్‌బాబు, సోషల్ వెల్ఫేర్ డీడీ అఖిలేశ్‌రెడ్డి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

