కోర్టు ధికరణ పిటిషన్లో సీఎస్‌కు హైకోర్టు నోటీసులు
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు మున్సిపల్ కార్మికుల క్రమబద్ధీకరణ వ్యవహారంలో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు మున్సిపల్ కార్మికుల క్రమబద్ధీకరణ వ్యవహారంలో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంపై పురపాలక శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ బుధవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరై, అఫిడవిట్ దాఖలు చేశారు.
మున్సిపల్ కార్మికుల క్రమబద్ధీకరణకు సంబంధించి గతంలో కోర్టు జారీచేసిన ఉత్తర్వుల అమలుకు చర్యలు చేపడుతున్నామని ఆయన అఫిడవిట్లో పేర్కొనడంపై జస్టిస్ టీ మాధవీదేవి అసంతృప్పి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ ఉత్తర్వులను అమలు చేయాల్సింది దానకిశోర్ కాదని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత సీఎస్‌పై ఉన్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ సంజయ్ జాజును సుమోటోగా ప్రతివాదిగా చేర్చి, ఆయనకు నోటీసులు జారీచేశారు. డిసెంబర్ 23న వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో సీఎస్‌కు స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

