ప్రజలపైన ఎలాంటి పన్నుల భారం వేయకుండా ప్రభుత్వ అవసరాలను, ఆలోచనలను దృష్టి లో ఉంచుకొని అన్ని శాఖల్లో ప్రత్యామ్నాయ ఆదాయం పెంపుపై అధికారులు దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార సూ చించారు.
పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా దానకిశోర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నారు.
తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ల వరుస బదిలీలు కొనసాగుతున్నాయి. ఇటీవలే 9 మంది 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు అదనపు కలెక్టర్లుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.