భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు.. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిగా దానకిశోర్
తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌ల వరుస బదిలీలు కొనసాగుతున్నాయి. ఇటీవలే 9 మంది 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు అదనపు కలెక్టర్లుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
- 11 మంది ఐఏఎస్, 10 మంది ఐపీఎస్‌ల బదిలీలు
- మరో ఐదుగురు పోలీస్ అధికారులకు స్థాన చలనం
- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌ల వరుస బదిలీలు కొనసాగుతున్నాయి. ఇటీవలే 9 మంది 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు అదనపు కలెక్టర్లుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఆదివారం రాష్ట్రంలో 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కీలకమైన పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శిగా దానకిశోర్‌ను నియమించగా, ఆ స్థానంలో ఉన్న అర్వింద్ కుమార్‌ను విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేసింది. నల్లగొండ కలెక్టర్ ఆర్వీకర్ణన్‌ను వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా నియమించింది. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్, హైదరాబాద్ పోలీస్ క్రైమ్స్ అండ్ సిట్ జాయింట్ సీపీగా ఏవీ రంగనాథ్‌కు బాధ్యతలు అప్పగించింది. వీరితోపాటు మరో ఐదుగురు సీనియర్ పోలీస్ అధికారులకు స్థానచలనం కల్పించింది. ఇందులో కొందరు ఐపీఎస్, పోలీస్ అధికారులను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
జలమండలి బోర్డుపై దానకిశోర్ ముద్ర
జలమండలిబోర్డుపై దానకిశోర్ తనదైన ముద్రవేశారు. ఐటీ, రెవెన్యూ, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాలో విప్లవాత్మకమైన మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చారు. వేసనిలోనూ తాగునీటి ఎద్దడి లేకుండా సమృద్దిగా నీటిని అందించారు. తన పనితీరుతో బోర్డుకు అనేక అవార్డులు తెచ్చిపెట్టారు.



Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- AV Ranganath
- Danakishore
- IAS
- IPS
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

