Watch: చాలా దూరం కారును ఈడ్చుకెళ్లిన లారీ.. షాకింగ్ వీడియో వైరల్
Truck Drags Car | ఒక కార్గో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కారును కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. కారులో ఉన్న వారు ప్రాధేయపడినప్పటికీ పట్టించుకోలేదు. చివరకు స్థానికులు ఆ లారీని అడ్డుకున్నారు. ఆ డ్రైవర్‌ను చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు.
భోపాల్: ఒక కార్గో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కారును కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. కారులో ఉన్న వారు ప్రాధేయపడినప్పటికీ పట్టించుకోలేదు. చివరకు స్థానికులు ఆ లారీని అడ్డుకున్నారు. ఆ డ్రైవర్‌ను చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. (Truck Drags Car) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బజేరా గ్రామం సమీపంలోని డాబ్రా- గ్వాలియర్ జాతీయ రహదారిపై రాజస్థాన్‌కు చెందిన కార్గో లారీ వెళ్తున్నది. రోడ్డు పక్కగా అడ్డంగా ఆగి ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన కారును ఢీకొట్టింది. ఆ తర్వాత సుమారు 1.5 కిలోమీటర్ల దూరం వరకు ఆ కారును లారీ ఈడ్చుకెళ్లింది.
కాగా, ఆ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సహాయం కోసం అరిచారు. లారీని ఆపాలని డ్రైవర్‌ను వేడుకున్నారు. ఒక వ్యక్తి బైక్‌పై ఆ లారీని వెంబడించాడు. లారీని నిలుపాలని డ్రైవర్‌కు చెప్పినప్పటికీ అతడు పట్టించుకోలేదు. చివరకు రోడ్డు పక్కన ఉన్న గుంత వైపు కారును తోసి పారిపోయేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు.
మరోవైపు బిలావా ప్రాంతంలో స్థానికులు ఆ లారీని అడ్డుకున్నారు. డ్రైవర్‌పై మూకుమ్మడిగా దాడి చేసి కొట్టారు. పోలీసులు అక్కడకు చేరుకోగా ఆ డ్రైవర్‌ను అప్పగించారు. కారులో ప్రయాణిస్తున్న వారిలో స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్ అధికారి కూడా ఉన్నట్లు సమాచారం. ఆ లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారును లారీ ఈడ్చుకెళ్లిన షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Truck Drags Car For 1.5 Km On Dabra – Gwalior Highway, Passengers Escape Unhurt; Incident Caught On Camera #MPnews #MadhyaPradesh pic.twitter.com/zUQu3qUyvG
— Free Press Madhya Pradesh (@FreePressMP) March 1, 2026
Also Read:
Bengaluru techie dies by suicide | వివాహం విఫలమవుతుందన్న జ్యోతిష్కుడు.. టెకీ ఆత్మహత్య
Watch: డీజే ఆపేయడంపై గొడవ.. హింసాత్మకంగా మారిన ఘర్షణ
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- car
- Drags
- Highway
- Madhya Pradesh
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

