Ramba Oorvasi Menaka Teaser | 25 ఏళ్ల ఎదురుచూపులకు తెర.. రంభ, ఊర్వశి, మేనకలు దిగొస్తే, టీజర్ అదుర్స్!
Ramba Oorvasi Menaka Teaser | టాలీవుడ్లో కామెడీకి తనదైన శైలిని జోడిస్తూ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ మరో ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా, సురభి హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండా, ప్రసాద్ నిమ్మకాయల నిర్మిస్తున్న ఈ సినిమాకు చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Ramba Oorvasi Menaka Teaser | టాలీవుడ్లో కామెడీకి తనదైన శైలిని జోడిస్తూ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ మరో ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా, సురభి హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండా, ప్రసాద్ నిమ్మకాయల నిర్మిస్తున్న ఈ సినిమాకు చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను జోరుగా ప్రారంభించింది. ఇందులో భాగంగా తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది.
‘రంభ ఊర్వశి మేనక’ కథలో ఆసక్తికరమైన ఫాంటసీ ఎలిమెంట్‌ను జోడించినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. హీరోకు చిన్నతనంలో ఓ ప్రత్యేకమైన పుస్తకం దొరుకుతుంది. అందులో సూచించిన విధంగా ముగ్గు వేసి, రంభ, ఊర్వశి, మేనకలను పూజిస్తే వారు భూలోకానికి వచ్చి కోరుకున్న కోరికలను నెరవేరుస్తారనే విషయం అతడికి తెలుస్తుంది. అప్పటి నుంచి హీరో ఏకంగా పాతికేళ్ల పాటు రంభ, ఊర్వశి, మేనకల కోసం ఎదురుచూస్తూ పూజలు చేస్తుంటాడు. ఎట్టకేలకు అతడి నిరీక్షణ ఫలించి ఆ ముగ్గురు అప్సరసలు భూలోకానికి దిగివస్తారు. ఆ తర్వాత హీరో జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అతడి కోరికలు నెరవేరాయా? లేక ముగ్గురు అప్సరసల రాకతో అతడి జీవితమే తలకిందులైందా? అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు టీజర్ తెలియజేస్తుంది.
ఈ సినిమాలో రంభ పాత్రలో రాశి సింగ్, ఊర్వశిగా విష్ణుప్రియ, మేనకగా ప్రిషా సింగ్ కనిపించనున్నారు. ఇక దేవేంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. టీజర్లో వెన్నెల కిషోర్ కనిపించిన తీరు కూడా కామెడీకి మరింత బలం చేకూర్చేలా ఉంది. అల్లరి నరేష్ కామెడీ టైమింగ్‌కు ఫాంటసీ కథను జోడించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారే అవకాశముంది. ముఖ్యంగా 25 ఏళ్లుగా అప్సరసల కోసం ఎదురుచూస్తున్న హీరోకు వారు నిజంగా ప్రత్యక్షమైన తర్వాత ఎదురయ్యే పరిస్థితులను దర్శకుడు చంద్ర మోహన్ ఎలా తెరకెక్కించారనేది ఆసక్తికరంగా మారింది. టీజర్లో హీరో పాత్ర, అతడి అమాయకత్వం, అప్సరసల రాకతో ఏర్పడే గందరగోళం ప్రధానంగా కనిపిస్తున్నాయి. సాధారణ కామెడీ కథకు ఫాంటసీ అంశాలను జోడించడం వల్ల సినిమా కొత్తగా అనిపించేలా ఉంది. టైటిల్‌కు తగ్గట్టుగానే రంభ, ఊర్వశి, మేనకల చుట్టూ కథను నడిపిస్తూ ప్రేక్షకులను నవ్వించేందుకు చిత్రబృందం ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

