Southwest Monsoon | రేపటి నుంచి నైరుతి నిష్క్రమణ.. త్వరలోనే ఈశాన్య రుతుపవనాల రాక
వానకాలం ముగింపు దశకు చేరుకొన్నది. ఈ నెల 17 నుంచి వాయవ్య రాజస్థాన్ ప్రాంతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్రమణ ప్రక్రియ ప్రారంభం కాను న్నదని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రక్రియ అక్టోబర్ 15 నాటికి ముగుస్తుందని పేర్కొన్నది.
Southwest Monsoon | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : వానకాలం ముగింపు దశకు చేరుకొన్నది. ఈ నెల 17 నుంచి వాయవ్య రాజస్థాన్ ప్రాంతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్రమణ ప్రక్రియ ప్రారంభం కాను న్నదని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రక్రియ అక్టోబర్ 15 నాటికి ముగుస్తుందని పేర్కొన్నది. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో ఈశాన్య రుతుపవనాల రాక మొదలవుతుంది.
ఈ ఏడాది జూన్ 1నుంచి సెప్టెంబ ర్ 14వరకు దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం 14శాతానికిపైగా లోటు నమోదైంది. వానకాలం చివరి నాటికి వర్షపాతం లో లోటు 10శాతం కంటే ఎకువగానే ఉం డనున్నది. దీంతో దేశంలో కరువు పరిస్థితులు దాపురించే ముప్పు ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో తాగునీటి నిల్వలు, జలవిద్యుదుత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

