కాంగ్రెస్ తెచ్చిన 22ఏ నిషేధిత జాబితాతో పాలకుల గుప్పిట్లోకి ప్రజల ఆస్తులు చేరాయని బాధితులు కన్నెర్ర చేస్తున్నారు. ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రజా వంచన పాలనకు ఒడిగడుతున్నదని మండిపడుతున్నారు. వందలాది కాలనీలు నిషేధిత జాబితాలోకి చేర్చడంతో కాంగ్రెస్ నాయకులు భూదందాకు తెరలేపారని దుమ్మెత్తి పోస్తున్నారు. పలు కాలనీలు నిషేధిత జాబితాలో పెట్టామని మంత్రి పొంగులేటి ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చోటామోటా నేతలు సెంటిల్మెంట్లు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలకు తగిన బుద్ధి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల రియల్ దందా సాగించేందుకే ప్రజల ఆస్తులను ప్రభుత్వ జాబితాలోకి మారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. పట్టా భూముల్లో నిర్మించుకున్న ఇండ్లు 22ఏలోకి చేరడంపై మనోవేదనకు గురవుతున్నారు. పైసా పైసా కూడబెట్టుకుని నిర్మించుకుని ఆశల సౌధాలపై తమకు హక్కులు లేవనే మాట వినడంతో తీవ్ర మనస్తాపం చెందుతున్నారు.ఆస్తులు అమ్ముకోలేని, కొనుక్కోలేని దుస్థితికి చేరడంపై ఆవేదన చెందుతున్నారు.22ఏ నుంచి తమ ఆస్తులను తొలగించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో భూ యజమానులు అయోమయానికి గురవుతున్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే కాంగ్రెస్ సరారు ప్రజా వ్యతిరేక విధానాలతో విరుచుకుపడుతోంది. ధన దాహంతో రోజుకో దందాకు తెరలేపుతూ జనాల రక్తాన్ని పిండుతోంది. నిబంధనల ప్రకారం అన్ని ప్రభుత్వ అనుమతులు పొంది, నివాసాలు ఉంటున్న భవనాలను కూడా విడిచిపెట్టకుండా అక్రమంగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చుతూ భూ యజమానులకు చుక్కలు చూపిస్తోంది. గడిచిన ఆరు నెలలుగా నగరంలో సాగుతున్న 22ఏ నిషేధిత జాబితా విధ్వంసంలో తవ్విన కొద్ది అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి.జీహెచ్ఎంసీ అనుమతులతో పకాగా నిర్మించుకున్న నివాసాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ అనుమతులు, నిర్మాణ ఛార్జీలు, నిబంధనలను పాటిస్తే చేపట్టిన అపార్టుమెంట్లను కూడా నిషేధిత జాబితాలో వేసి చోద్యం చూస్తోంది. జనాలను ఇబ్బందులకు గురిచేయడమే ప్రభుత్వ లక్ష్యమనే తీరుగా వ్యవహరిస్తోంది. తాజాగా కూకట్పల్లి వై జంక్షన్ సమీపంలో స్పేస్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ పరిధిలోని 450 గజాల్లో నిర్మించిన జీ+5 అంతస్తుల భవనమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన ఈ భవనానికి మూడేళ్ల కిందటే అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) మంజూరు చేశారు. సర్వహకులతో నిర్మించుకున్న ఈ ఆస్తిని నిషేధిత జాబితాలో చేర్చి సరారు తన రాక్షస పాలనతో వేధింపులకు గురిచేస్తోంది. ఇదే విషయాన్ని ఇంటి యజమాలకు ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఆందోళన చెందుతున్నారు. ఇక జీహెచ్ఎంసీ ఇచ్చే ఆక్యుపెన్సీలు ఎందుకు? అనుమతులు దేనికనీ ప్రశ్నిస్తున్నారు.
పటాన్చెరు గ్రామం రాజేంద్రనగర్ పరిధిలోని పీఆర్ఎం చెరువు హిమాయత్‌సాగర్ సెక్షన్‌కు చెందిన ఓ నిర్మాణానికి మార్చి 6న 20 కొత్త 3 ఫేస్ డొమెస్టిక్ కనెక్షన్లు ఇవ్వడానికి నిర్ణయించారు.ఇప్పటికే ఉన్న 5 కిలోవాట్ లోడ్‌తో కలిపి మొత్తం లోడ్‌ను 105 కిలోవాట్‌గా లెక్కించారు. రూ.7.55 లక్షల ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించారు. ఇందుకు పరిపాలనా,
సాంకేతిక అనుమతులు సైతం మంజూరయ్యాయి. అండర్‌గ్రౌండ్ కేబుల్‌తో పనులు చేయాలని అనుకున్నప్పటికీ మున్సిపల్ అనుమతులు లభించకపోవడంతో ఓవర్హెడ్కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్టిమేషన్ ఆటో రిజెక్ట్ అయింది. ఎస్టిమేట్ పునరుద్ధరించి పనులు చేసుకునే అనుమతి ఇవ్వాలంటూ వినియోగదారుడు సీఎండీకి గత నెల 7న లేఖ రాసి కార్యాలయంలో ఇచ్చారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): గచ్చిబౌలి సెక్షన్ గోపన్‌పల్లిలో ఓ ఇంటికి సంబంధించి నిర్మాణ సమయంలో ఇచ్చిన కమర్షియల్ కనెక్షన్‌ను డొమెస్టిక్‌గా మార్చాలంటూ జూన్ 8న ఓ వినియోగదారుడు సీఎండీ జితేష్పాటిల్కు లేఖ రాశారు. కమర్షియల్ స్లాబ్ ప్రకారం విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తున్నదని, డొమెస్టిక్ స్లాబ్ వర్తించేలా కనెక్షన్‌ను మార్చాలని అందులో పేర్కొన్నారు. నిర్మాణం పూర్తి అయిన ఈ భవనానికి మార్చి 22న జీహెచ్ఎంసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చింది. ఓసీ వచ్చినా మూడు నెలలు గడిచినా కనెక్షన్ కేటగిరీ మార్పునకు టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది ఇంకా జాప్యం చేస్తూనే ఉన్నారు. కేటగిరీ మార్పునకు ఉన్న అభ్యంతర ఏంటనేది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు.
ఈ విషయంలో స్థానిక అధికారులతో పాటు సీఎండీ వరకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని వినియోగదారుడు ఆందోళన చెందుతున్నాడు. కనెక్షన్ కేటగిరీ మార్పు, కొత్త కనెక్షన్, లైన్ విస్తరణ, డీటీఆర్ ఏర్పాటు, చెల్లింపులు, అనుమతులు.. టీజీఎస్పీడీసీఎల్కు సంబంధించిన ఏ పనికైనా ప్రతీ దశలో వినియోగదారుడు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది. ఇన్నాళ్లూ అనుమతులు లేవంటూ కనెక్షన్లు నిరాకరించిన ఎస్పీడీసీఎల్ అధికారులు ఇప్పుడు ఏదో ఒక సాకు చూపి విద్యుత్ కనెక్షన్ల విషయంలో జాప్యం చేస్తుండటంతో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పలువురు వినియోగదారులకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు.
ఓసీ వచ్చినా కొర్రీలు తప్పడం లేదు..
ఓసీ వచ్చి.. ఎస్టిమేట్ వచ్చినా డిస్కం పరంగా కనెక్షన్ల విషయంలో ఏదో ఒక కొర్రీ తప్పడం లేదు. దీంతో నగరవాసులను కరెంట్ కష్టాలు వెంటాడుతున్నాయి. భవన నిర్మాణం పూర్తయి ఆక్యుపెన్సీ వచ్చినా విద్యుత్ కనెక్షన్ విషయంలో వినియోగదారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కొన్నాళ్లు ఓపికగా ఎదురుచూసి ఇక తప్పదంటూ సాక్షాత్తు సీఎండీకే లేఖలు రాస్తున్నారు. అయినా వాటిపై ఉన్నతాధికారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
ఒకవైపు ఉన్న కమర్షియల్ విద్యుత్ కనెక్షన్‌ను డొమెస్టిక్‌గా మార్చాలని సీఎండీకి వినతి అందగా, మరోవైపు 20 డొమెస్టిక్ కనెక్షన్ల కోసం విద్యుత్ సంస్థే ఎస్టిమేట్ రూపొందించి, అడ్మినిస్ట్రేటి అప్రూవల్, టెక్నికల్ సాంక్షన్ ఇచ్చినా సరఫరా ప్రక్రియపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్నాళ్లూ ఓసీ లేకపోతే కరెంట్ కనెక్షన్లు ఇచ్చేది లేదని చెప్పిన దక్షిణ డిస్కం ఇప్పుడు ఓసీ ఉన్నా కనెక్షన్ ఇవ్వడానికి అనేక కొర్రీలు పెడుతోంది. స్పష్టంగా తమ భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉన్నదని వినియోగదారులు చెప్పినప్పటికీ కనెక్షన్ ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారనడానికి సిబ్బంది నుంచి సమాధానం లేదు. దీంతో నగరశివారు ప్రాంతాల్లో కనెక్షన్లు లేక చాలామంది నానాఇబ్బందులు పడుతున్నారు.
పది నెలలు.. 50 వేల కనెక్షన్లు పెండింగ్
టీజీఎస్పీడీసీఎల్కు గత పదినెలల కాలంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ విషయంలో కచ్చితత్వం పాటిస్తున్నది. నగరంలో పది మీటర్లపైన ఉన్న భవంతులకు కచ్చితంగా ఓసీ కావాలనే నిబంధన ఉన్న నేపథ్యంలో పది నెలల కాలంగా సుమారు యాభైవేలకు పైగా కనెక్షన్లు పెండింగ్‌లో పడిపోయాయి. నగరంలో ఉన్న భవనాల్లో చాలా వరకు అనుమతులు తీసుకున్నా.. నిర్మాణాల్లో తేడాలుండటంతో ఓసీలు రావడం లేదు. ఇదిలా ఉంటే మరోవైపు సహజంగా ఓసీ వచ్చిన వారికి సైతం కనెక్షన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని చర్చ సాగుతున్నది.
సంస్థాగతంగా ఆదాయం వచ్చే అంశాలను వదిలేసి అనవసరమైన వాటికి ఖర్చు చేస్తూ ఆర్భాటాలు చేస్తున్నారు తప్పా సంస్థ ఆదాయం పెంచే అంశాలపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓసీ ఉన్నప్పటికీ కనెక్షన్ రాని పరిస్థితి ప్రస్తుతం నగరంలో కనిపిస్తుంది. భవనానికి ఓసీ ఉన్నప్పుడు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏంటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ముఖ్యంగా ఇదే విషయమై వినియోగదారుల ప్రశ్నలకు అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదు. ఈ విషయంలో సీఎండీ జితేష్ వీ పాటిల్ చొరవ తీసుకుని క్షేత్రస్థాయిలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.
సభను తప్పుదోవ పట్టించిన మంత్రి
ఏ ఒక ప్రైవేటు ప్రాపర్టీ నిషేధిత జాబితాలో లేదంటూ ప్రభుత్వ పెద్దలు అబద్ధాలాడుతున్నారు. శాసనసభ వేదికగా రెవెన్యూ మంత్రి వాస్తవాలను విస్మరించి మాట్లాడటంపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఏళ్లుగా నివాసముంటున్న వారిని భూ కబ్జాదారులుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ప్రజల ఆస్తులపై హక్కులను కాలరాస్తున్న సర్కారు.. 22ఏ జాబితాలో చేస్తున్న విధ్వంస కాండతో లక్షలాది ఆస్తుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మార్చుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చే భవన నిర్మాణ అనుమతులకు విలువ లేకుండా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో జనాలు రోడ్డున పడే పరిస్థితులు దాపురిస్తున్నాయి. మరోవైపు 22ఏ భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌర సమాజం నుంచి డిమాండ్ వ్యక్తం అవుతుంది. కోర్టు ఆదేశించినా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం వెనుక భూ అక్రమాలు తెరలేపిందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో నిషేధిత జాబితా అంశంలో సర్కారు తక్షణమే స్పందించి, జాబితాలోని ఆయా ప్రాంతాలను తొలగించి, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. కానీ సర్కారు మాత్రం ప్రజల ఆస్తులను లూటీ చేసే కుట్రలో భాగంగానే ఇప్పటికీ కాలయాపన చేస్తుందని, జరుగుతున్న జాప్యంతో హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
22ఏపై పోరాటం ఆగదు
లక్షల ఎకరాలను ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చింది. ప్రభుత్వ తప్పిదం వల్ల ప్రైవేటు భూములు ప్రభుత్వ భూములుగా మారిపోయాయి. ప్రజల ఆస్తి వారికి కాకుండా మారింది. ఖాళీ ప్లాట్ల యజమానులు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. అత్యవసర సమయాల్లో ప్లాట్లు, ఇండ్లు అమ్ముకునే పరిస్థితులు లేకుండా పోయాయి. పాలకుల అసమర్థత, చేతకాని తనం ప్రభుత్వం నడపలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం ఆగమేఘాల మీద 22ఏ ని తీసుకువచ్చి ప్రజల భూములను కాజేసే కుట్రకు తెరలేపింది. బాధితుల రక్షణ కోసమే బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ప్రజలకు క్షమాపణ చెబుతున్నానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉంది.
– దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే
ఏండ్ల తరబడి నివాసముంటున్నాం
మహేంద్రాహిల్స్‌లో 74 సర్వే నంబర్ లో 330 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం 22ఏ లో చేర్చడంతో కాలనీ వాసులందరం ఆందోళనకు గురి అవుతున్నాం. సర్వే నంబర్ మొత్తం మీద నిషేధం విధించడం వల్ల దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రైవేటు ఆస్తుల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఏళ్ల తరబడి నివాసముంటూ..ఇళ్లకు సంబంధించిన పత్రాలు రిజిస్ట్రేషన్ వివరాలు ఉన్నప్పటికీ 22ఏ జాబితా కారణంగా ఆస్తుల భవిష్యత్‌పై ఆందోళన నెలకొంది. ఇన్నేళ్లుగా పన్నులు చెల్లిస్తూ అందుబాటులో ఉన్న చట్టబద్ధ పత్రాలతో ఆస్తులను అనుభవిస్తున్న వారికి ఇప్పుడు 22ఏ సమస్య రావడం ఆందోళన కల్గిస్తుంది. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. ప్రైవేటు భూములు, ఆస్తులపై నిషేధం ఎత్తివేసి ఇబ్బందులకు లేకుండా చూడాలి.
-భాస్కర్‌రావు, త్రిమూర్తి కాలనీ కో, ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు