పుణె, సెప్టెంబర్ 15 : ప్రతి సంవత్సరం గణేశ్ ఉత్సవాల సందర్భంగా భక్తులు రకరకాల వస్తువులు, తినే పదార్థాలతో విగ్రహాలను ఏర్పాటుచేస్తుంటారు. ఈ ఏడాది పుణెలో ‘చాట్’ దుకాణం నిర్వాహకులు 21,000 వేల పానీపూరీలతో ఏర్పాటుచేసిన 13 అడుగుల గణేశ్ విగ్రహం సోషల్మీడియాలో వైరల్గా మారింది. నగరంలోని ఎఫ్సీ రోడ్లోని ‘గణేశ్ భేల్’ నిర్వాహకులు ఏర్పాటుచేయగా, విగ్రహం తయారీ కోసం రూపేశ్, దినేశ్ అనే ఇద్దరు కళాకారులు రెండు నెలలపాటు శ్రమించారట.
ఇలాంటి వినూత్నమైన విగ్రహాలు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో అనేకం వెలిసినప్పటకీ, ‘పానీపూరీ’లతో చేసిన విగ్రహం అందరి దృష్టిని ఆకర్షించింది. పర్యావరణ హితమైన ఈ విగ్రహాన్ని వేడుకలు ముగిసిన తర్వాత నీటిలో నిమజ్జనం చేయడానికి బదులు, సేంద్రీయ ఎరువు తయారీకి ఉపయోగిస్తారట.