లక్నో: ఒక మహిళ ప్రముఖ మాల్లో నెయ్యి, రిఫైన్డ్ ఆయిల్‌ను దొంగిలించింది. సీసీటీవీలో గుర్తించిన సిబ్బంది బయటకు వెళ్తున్న ఆమెను అడ్డుకున్నారు. ఆ మహిళ బ్యాగ్ తనిఖీ చేసి అందులో ఉన్న ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Woman Steal From Mall) దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. సెక్టార్ 18లోని డీఎల్ఎఫ్ మాల్ నుంచి ఒక మహిళ అనుమానాస్పదంగా బయటకు వెళ్లడాన్ని సిబ్బంది గమనించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా నెయ్యి, రిఫైన్డ్ ఆయిల్ బాటిల్స్‌ను ఆమె చోరీ చేసినట్లు గుర్తించారు. దీంతో గేట్ వద్ద ఆ మహిళను అడ్డుకున్నారు. ఆమె చేతి బ్యాగ్‌ను తనిఖీ చేసి అందులో ఉన్న ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. చివరకు వాటికి డబ్బులు చెల్లించడంతో ఆమెను వెళ్లనిచ్చినట్లు సమాచారం.
కాగా, చూసేందుకు ఉన్నత కుటుంబానికి చెందినట్లుగా ఉన్న ఆ మహిళ నెల రోజులకుపైగా ఆ మాల్‌కు వస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ఆమె గతంలో కూడా పలు సరుకులు చోరీ చేసినట్లుగా సీసీటీవీలో గుర్తించినట్లు వారు ఆరోపించారు. అయితే ఆ మహిళపై ఎలాంటి చర్యలు చేపట్టారు అన్నది తెలియలేదు. నెయ్యి, రిఫైన్డ్ ఆయిల్ బాటిల్స్ దొంగిలించిన మహిళను మాల్ సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆన్లైన్లో చర్చకు దారితీసింది.
A woman was caught red-handed stealing ghee and refined cooking oil at DLF Mall, Noida!
It is alleged that CCTV footage shows the woman stealing from the same store several times over the past month.💔😭 https://t.co/doa0pNqXq8
— RASHMIKA SAHAY (@RASHMIKA_003) October 5, 2026
DLF Mall Noida: Mall employees caught a man and a woman red-handed while stealing https://t.co/BfXPHJuXmK
— Ramesh Speaks (@rameshofficial0) October 5, 2026