లక్నో: భార్య, ఆమె ప్రియుడితో కలిసి ఉన్నట్లు భర్త తెలుసుకున్నాడు. అక్కడకు చేరుకుని వారిద్దరిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడి వారిద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహిళ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Man Shoots Wife, Her Lover) ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. రిషబ్, షిప్రాలకు సుమారు పదేళ్ల కిందట వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇంటర్నెట్ కేఫ్ నిర్వహించే సన్నీ అలియాస్ శివ ఠాకూర్‌తో భార్యకు వివాహేతర సంబంధం ఉన్నదని భర్త రిషబ్ అనుమానించాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
కాగా, అక్టోబర్ 6న రాత్రి 10 గంటల సమయంలో సన్నీకి చెందిన ఇంటర్నెట్ కేఫ్‌లో అతడితో కలిసి తన భార్య షిప్రా ఉన్నట్లు భర్త రిషబ్ తెలుసుకున్నాడు. దీంతో కుమారుడితో కలిసి అక్కడకు చేరుకున్నాడు. ఆగ్రహించిన రిషబ్ తన వద్ద ఉన్న లైసెన్స్ రివాల్వర్ బయటకు తీసి వారిద్దరిపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. తొలుత సన్నీపై రెండు రౌండ్లు, ఆ తర్వాత భార్య షిప్రాపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఘటనకు రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో భయాందోళనలు రేకెత్తాయి. పలు షాపుల యజమానులు వాటిని మూసివేసి పరుగులు తీశారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కాల్పులు జరిపిన రిషబ్‌ను అరెస్ట్ చేశారు. లైసెన్స్ ఉన్న రివాల్వర్, తూటాలు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల్లో గాయపడిన షిప్రా, సన్నీని జిల్లా ఆసుపత్రిలోని ట్రామా సెంటర్‌కు పోలీసులు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆగ్రా మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు.
అయితే సన్నీతో తనకు సంబంధం ఉందన్న భర్త ఆరోపణలను భార్య షిప్రా ఖండించింది. తనను హత్య చేయాలన్న ప్లాన్‌లో భాగంగానే భర్త తనపై కాల్పులు జరిపినట్లు ఆమె ఆరోపించింది. ఈ ఘటన జరిగినప్పుడు ఆ దంపతుల కుమారుడు అక్కడే ఉన్నాడు. కాల్పుల దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో అతడు రికార్డ్ చేశాడు. ‘నాన్నా వద్దు’ అని తండ్రిని కొడుకు వేడుకోవడం వినిపించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
फिरोजाबाद
रिषभ ने पत्नी और उसके प्रेमी को ड्रिंक करते वक्त गोली मारी उसके बाद उसकी पत्नी सीसीटीवी फुटेज में दिखी… https://t.co/50lYnNRVOm
— Ajay Kumar Dwivedi… (@AjayDwi65357304) October 7, 2026
🚨 बाजार में पत्नी और उसके प्रेमी को साथ देखा तो पति ने बरसा दीं गोलियां, LIVE वीडियो आया सामने!
UP के फिरोजाबाद में पत्नी शिप्रा और उसके प्रेमी जितेंद्र को बाजार में एक साथ देखकर ऋषभ ने कथित तौर पर अपने लाइसेंसी रिवॉल्वर से दोनों पर फायरिंग कर दी।
गोलीबारी की यह पूरी घटना कैमरे में कैद हो गई। घटना के बाद दोनों घायलों को अस्पताल में भर्ती कराया गया, जहां उनकी हालत गंभीर बताई जा रही है।
पुलिस ने आरोपी पति को हिरासत में लिया है। मामले की जांच जारी है।
— Jamwant Maurya (@JamwantM) October 7, 2026
Husband flies into a rage upon seeing wife drinking with her lover; a hail of bullets is fired right inside the shop!
In #Firozabad, #UttarPradesh, Rishabh fired multiple rounds at his wife, Shipra, and her lover, Sunny.
Reports indicate that the two were drinking alcohol in a shop when the husband spotted them. Shipra was struck by five bullets—hitting her abdomen, waist, and ribs—while Sunny was hit by two bullets in the chest.
The police have arrested the accused husband, Rishabh.
No one knows when a dispute within a relationship might escalate into violence. Taking the law into one’s own hands in such situations is never justified.
In your opinion, what steps should be taken to prevent such disputes from turning violent? https://t.co/XYpBuQGvqp
— Siraj Noorani (@sirajnoorani) October 7, 2026
Firozabad:
Wife Shipra and her lover Jitendra, alias Sunny, were sitting together and drinking.
When husband Rishabh Tailang saw them like this, he took out his licensed revolver and shot both of them.
A divorce case between the couple was already pending in court.
Both were badly injured and have been admitted to a hospital in Agra.
In 2018, the Supreme Court stopped treating affairs outside marriage (Section 497) as a crime. An affair is no longer a criminal offense; it can only be used as a ground for divorce.
On the other side, husbands are hit with false domestic-violence and dowry cases, and money is extracted in the name of alimony and maintenance.
Until an affair is again declared a crime, violent incidents like this will not stop.
— JusticeForMen (@Mr_Prajapat551) October 7, 2026