ఇందిరమ్మ .. ఇదేందమ్మా!
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రకటించినప్పటి నుంచి దరఖాస్తుదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి నుంచి వివాదస్పదం అవుతున్నది.
- ఇల్లు రానివారికి ఫీజు వెనక్కి ఇవ్వని సర్కారు
- సాంకేతిక సమస్యలంటూ అధికారుల దాటవేత
- హౌసింగ్ బోర్డు చుట్టూ తిరుగుతున్న బాధితులు
- అర్జీదారులకు మొండిచెయ్యి
సిటీ బ్యూరో, నవంబర్ 19:కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రకటించినప్పటి నుంచి దరఖాస్తుదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి నుంచి వివాదస్పదం అవుతున్నది. 16 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లోపించడంతో అనర్హులకు ఇండ్లు కేటాయించారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు దళారులు లాటరీలో పేరు వచ్చేలా చూస్తామని దరఖాస్తుదారుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇందిరమ్మ ఇండ్ల లాటరీలో పేరు వచ్చిన వారిలో కొంతమందికి ఇండ్లు కేటాయించకపోవడం వివాదస్పదమైంది. మొత్తంగా ఆగమేఘాల మీద ప్రకటనలు, అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై నగర ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఇప్పటికి ఇంకా నాలుగు నియోజకవర్గాల లబ్ధిదారుల ఎంపికలో తీవ్ర జాప్యం అవుతున్నది. ఈ నేపథ్యంలో మొదటి దశలోదరఖాస్తు చేసుకుని వారికి అప్లికేషన్ ఫీజు రూ.10 వేలు ఇంకా వెనక్కి తిరిగి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు చేసుకున్నా లాటరీలో ఇల్లు రానివారికి దరఖాస్తు ఫీజు పది వేలు వెంటనే వెనక్కి తిరిగి ఇవ్వాలని నిబంధనల్లో ఉంది. కానీ నెలలు గడుస్తున్నా వేలాది మంది దరఖాస్తు దారులకు ఇంకా దరఖాస్తు ఫీజు వెనక్కి ఇవ్వకపోవడంతో హౌసింగ్ బోర్డు ప్రధాన కార్యాలయం చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
సాంకేతిక సమస్యలంటూ జాప్యం..
రూ.10 వేల ఫీజును తిరిగి చెల్లించేందుకు అధికారులు సాంకేతిక సమస్యను బూచీగా చూపుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో లాటరీ ముగిసినా ఇప్పటికి వేలాది మంది హౌసింగ్ బోర్డుకు వరుస కడుతున్నారు. లాటరీ ప్రక్రియ ముగియగానే డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఖాతాలో జమ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టకపోవడం వల్లనే అడుగడుగునా సమస్యలు ఎదురవుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. లాటరీలో అవకతవకలు చేసి తమకు ఇండ్లు రాకుండా చేయడమే కాకుండా దరఖాస్తు ఫీజు చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, హౌసింగ్ బోర్డు అధికారులు స్పందించి తక్షణమే రూ.10 వేలు ఖాతాలో జమ చేయాలని వేలాది మంది బాధితులు కోరుతున్నారు.
హౌసింగ్ బోర్డు అధికారులు మాత్రం సాంకేతిక సమస్యల వల్లనే ఆలస్యం అవుతుందని.. వీలైనంత తొందరగా డబ్బులు జమ చేస్తామంటున్నారు. సాంకేతిక సమస్యలని కుంటి సాకులు చెబుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దరఖాస్తు ఫీజులు చెల్లిస్తే నెలల తరబడి ఎదురు చూసేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా వందలాది మంది తమ దరఖాస్తు ఫీజులు తిరిగివ్వాలని ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, హౌసింగ్ బోర్డు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

