రేవంత్ వర్సెస్ రాజగోపాల్
తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య రాజకీయ యుద్ధం రచ్చకెకింది. నిన్న మునుగోడు వేదికగా ముఖ్యమంత్రిని నేరుగా నిలదీసిన రాజగోపాల్‌రెడ్డి.. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. కొడంగల్‌కు వేల కోట్ల నిధులు కేటాయిస్తూ మునుగోడు వంటి వెనుకబడిన నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తిన ఆయన.. గురువారం రూ.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల వ్యవహారంలో సీఎం సోదరుల ప్రమేయం ఉన్నదంటూ ఆరోపణలు గుప్పించారు.
- కాంగ్రెస్‌లో బహిరంగ సమరం
- రెండు రోజులుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
- నిన్న సీఎం భాష మీద అభ్యంతరం.. నేడు 5 లక్షల కోట్ల భూదందా ఆరోపణ
- సోదరుల భూకబ్జాల నుంచి కొడంగల్ నియోజకవర్గానికి నిధుల దాకా విమర్శలు
- పిచ్చికుక కరిచింది.. పిచ్చి లేసినట్టు మాట్లాడుతున్నాడంటూ సీఎం దాడి
హైదరాబాద్ , నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య రాజకీయ యుద్ధం రచ్చకెకింది. నిన్న మునుగోడు వేదికగా ముఖ్యమంత్రిని నేరుగా నిలదీసిన రాజగోపాల్‌రెడ్డి.. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. కొడంగల్‌కు వేల కోట్ల నిధులు కేటాయిస్తూ మునుగోడు వంటి వెనుకబడిన నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తిన ఆయన.. గురువారం రూ.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల వ్యవహారంలో సీఎం సోదరుల ప్రమేయం ఉన్నదంటూ ఆరోపణలు గుప్పించారు.
ముఖ్యమంత్రి కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకొని ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. మరోవైపు సిద్ధిపేట సభలో రేవంత్‌రెడ్డి కూడా ఘాటైన పదజాలంతో ఎదురుదాడికి దిగారు. ‘మా వాళ్లకు కొంతమందికి పిచ్చికుక కరిచినట్టుంది.. ఏదేదో మాట్లాడుతున్నరు. చెడును మైక్‌లో చెప్తున్నరు.. మంచి నా ఇంటికొచ్చి చెవిలో చెప్తున్నరు’ అంటూ వ్యాఖ్యానించారు. పేర్లు ప్రస్తావించకపోయినా ఈ వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీంతో కాంగ్రెస్‌లో అంతర్గత అసమ్మతి ఇప్పుడు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే మధ్య ప్రత్యక్ష మాటల యుద్ధంగా మారింది.
మునుగోడులో రేవంత్‌కు సూటి ప్రశ్నలు
మునుగోడులో బుధవారం నిర్వహించిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు కేటాయిస్తానని చెప్తున్న రేవంత్ రెడ్డి.. మునుగోడుకు కనీసం రూ.500 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ అంటే కొడంగల్, మధిర, హుజూర్నగర్ మాత్రమేనా? మిగతా 116 నియోజకవర్గాలు లేవా? అని నిలదీశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగితే ‘పండబెట్టి తొకుతా’ అని మాట్లాడుతారా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే భాష ఇదేనా? అంటూ రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. ‘అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అ య్యావు.. మరో రెండేండ్లయినా మంచిగా ఉం డు.. తెలంగాణ ప్రజలను మంచిగా చూసుకో’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
సిద్దిపేట సభలో సీఎం కౌంటర్
రాజగోపాల్‌రెడ్డి వరుస వ్యాఖ్యల నేపథ్యంలో సిద్దిపేట సభలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ‘మా వాళ్లకు కొంతమందికి పిచ్చికుక కరిచినట్టున్నది’ అంటూ మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి రెండు రోజులుగా చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఏఐసీసీకి ఫిర్యాదు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రకటించిన కొద్దిసేపటికే సీఎం రేవంత్‌రెడ్డి ఈ కౌంటర్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ వివాదంలో ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధానికి పార్టీ అధిష్ఠానం ఎలా ముగింపు పలుకుతుంది? రాజగోపాల్‌రెడ్డి ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్తుందా? లేక బహిరంగ విమర్శలు చేయవద్దంటూ ఎమ్మెల్యేకు క్రమశిక్షణ పాఠాలు చెప్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
భూముల వ్యవహారంతో మరో బాంబు
నిన్నటి విమర్శలతో ఆగకుండా గురువారం రాజగోపాల్‌రెడ్డి మరింత తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ పరిధిలో లిటిగేషన్లో ఉన్న లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల వ్యవహారంలో రేవంత్‌రెడ్డి సోదరులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వివాదాల్లో ఉన్న భూముల సమస్యలను తొలగించి ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సంచలన విషయాన్ని బయటపెట్టారు. అప్పుల పేరుతో తెచ్చిన నిధులు, కాంట్రాక్టుల కేటాయింపులు, ప్రభుత్వంలో అవినీతి వ్యవహారాలపైనా విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలు అధికార పార్టీలో మరింత ప్రకంపనలు సృష్టించాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

