ఉద్యోగాలివ్వడం చేతగాక అవమానిస్తారా..?
ఉద్యోగాలివ్వడం చేతగాకపోగా.. నిరుద్యోగ యువతను అవమానిస్తారా? అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, సత్యవతిరాథోడ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
- ‘క్రిమినల్ వేస్ట్’ అన్న సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనం
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత సర్కార్‌కు బుద్ధి చెప్పాలి
- బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, సత్యవతి రాథోడ్
- నిరుద్యోగుల సమస్యలపై మహబూబాబాద్ కలెక్టర్‌కు వినతి
మహబూబాబాద్, నవంబర్19 (నమస్తే తెలంగాణ)/ మహబూబాబాద్ రూరల్ : ఉద్యోగాలివ్వడం చేతగాకపోగా.. నిరుద్యోగ యువతను అవమానిస్తారా? అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, సత్యవతిరాథోడ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్‌రెడ్డితో కలిసి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం నిరుద్యోగ యువత ఎదురొంటున్న సమస్యలు, 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ తదితర అంశాలపై కలెక్టర్ స్నేహాశబరీష్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యాశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగ యువతను ఉద్దేశించి ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ వ్యాఖ్యానించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని చెప్పారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగుల సమస్యలే ప్రధాన ఎజెండాగా మారుతాయని తెలిపారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారా? రెండు ఎమ్మెల్సీలు ఓడగొట్టాలా.. అనే నినాదంతో యువత ముందుకెళ్లాలని, అప్పుడే నోటిఫికేషన్లు వస్తాయని పేర్కొన్నారు. ఉన్నత విద్యావంతుడు, యువత సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏనుగుల రాకేశ్‌రెడ్డికి పట్టభద్రులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు.
మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ , బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ విద్యారంగం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందని చెప్పారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల, ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన మార్నింగ్ వాక్‌లో పాల్గొన్నారు. పట్టభద్రులు, యువత, స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అండగా నిలవాలని కోరారు.
అనంతరం మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం నడివాడలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన సుస్మిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ ఎఅండగా ఉంటుందని, పార్టీ తరఫున కుటుంబానికి త్వరలోనే ఆర్థిక సాయం ప్రకటించి నేరుగా కుటుంబానికి అందేలా చూస్తామని, ఎలాంటి ఇబ్బంది ఉన్నా బీఆర్ఎస్ సపోర్ట్‌గా ఉంటుందని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

