మొగోళ్లు బెల్ట్‌షాప్‌కు పోతే ఆడోళ్లు సభకు వచ్చిండ్రు
‘అకాచెల్లెళ్లు నా సభ కోసం వచ్చిండ్రు. వంట కొంత ఆలస్యమైనా సరే అనుకొని ఇకడికి వచ్చిండ్రు. ఇంటి దగ్గర మొగోళ్లు బెల్ట్ షాప్‌కు పోయి వచ్చేలోపు మీటింగ్‌కు పోయి వస్తమని చెప్పి వచ్చిండ్రు’ అంటూ సిద్దిపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
- సిద్దిపేట సభలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు
- బెల్ట్ షాపులను అరికడుతానంటూనే అదో సాధారణ వ్యవహారంగా చిత్రీకరణ
- ఇంటి పెద్దలను అవమానించేలా మాటలు
- కేసీఆర్, హరీశ్, కేటీఆర్‌పై అనుచిత భాష
- ముఖ్యమంత్రి తీరుపై విమర్శల వెల్లువ
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ‘అకాచెల్లెళ్లు నా సభ కోసం వచ్చిండ్రు. వంట కొంత ఆలస్యమైనా సరే అనుకొని ఇకడికి వచ్చిండ్రు. ఇంటి దగ్గర మొగోళ్లు బెల్ట్ షాప్‌కు పోయి వచ్చేలోపు మీటింగ్‌కు పోయి వస్తమని చెప్పి వచ్చిండ్రు’ అంటూ సిద్దిపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. బెల్ట్ షాపులను అరికడుతానని గతంలో ప్రగల్భాలు పలికి నేడు అదొక సాధారణ వ్యవహారం అన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఇక ఇంట్లో మొగోళ్లు అందరూ తాగుబోతులు అన్నట్టుగా అవమానించిన తీరుపై సర్వ త్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురువారం సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభ లో సీఎం రేవంత్‌రెడ్డి.. మహిళలు సభకు హాజరు కావడాన్ని మగవాళ్ల మద్యం అలవాటుతో ముడిపెట్టి మాట్లాడారు. మహిళలు సభకు రావడాన్ని స్వాగతించే క్రమం లో వారి కుటుంబాల్లోని పురుషుల మ ద్యం అలవాటును ప్రస్తావించడం, బెల్ట్ షాపులకు వెళ్లడాన్ని సాధారణ వ్యవహారంగా చిత్రీకరించిన తీరుపై సభకు వచ్చిన వారే విస్తుపోయారు. సీఎం మాటలు బెల్ట్ షాపులకు పరోక్షంగా మద్దతు ఇచ్చినట్టు ఉన్నాయని సామాజిక కార్యకర్తలు అ భ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. బెల్టు దుకాణాలను నిర్మూలిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, వాటిని నిర్మూలించకపోగా 1.75లక్షల బెల్టు దు కాణాలకు పెంచిందని విమర్శిస్తున్నారు. మద్యం నియంత్రణపై స్పష్టమైన విధా నం ప్రకటించకుండా బెల్ట్ షాపుల వద్దకు వెళ్లే మగవాళ్లను ప్రస్తావిస్తూ అదో సాధారణ వ్యవహారంగా సీఎం మాట్లాడి ఏం సందేశం ఇచ్చినట్టు? అని ప్రశ్నిస్తున్నారు.
హద్దు అదుపు లేని భాష
సభలో రేవంత్ ఎప్పటిలానే కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని వ్యాఖ్యలు రాజకీయ విమర్శల పరిధి దాటి అనుచిత స్థాయికి చేరాయి. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్‌ను లక్ష్యం గా చేసుకొని అసభ్య పదజాలాన్ని వాడా రు. కేసీఆర్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ సం బంధాలను ప్రస్తావిస్తూ చేసిన రేవంత్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సిద్దిపేట ఎమ్మెల్యేను మంత్రిని చేస్తా
సిద్దిపేట ప్రజలను మభ్యపెట్టేందుకు రేవంత్‌రెడ్డి పదవుల ఆశ చూపారు. సిద్దిపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు. ఇంకా రెం డేండ్లు సీఎంగా కొనసాగుతానని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తనతో పను లు చేయించుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- belt shops
- harish rao
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

