ఆ లేఖ ఏదీ?
నాగార్జున సాగర్ నుంచి ఆంధ్ర నీటిదోపిడీపై కేఆర్ఎంబీకి లేఖ రాశానని చెప్తున్న సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఆ లేఖ ఎప్పుడు రాశారో? బహిర్గతం చేయాలి.
- కేఆర్ఎంబీకి రాసిన ఉత్తరాన్ని బయటపెట్టు ఉత్తమ్!
- కాంగ్రెస్ రాకతోనే పరాయి పాలనలోకి సాగర్
- డ్యామ్ వద్దే ఏపీ పనులు చేస్తుంటే ఏం చేస్తున్నరు?
- జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిది ప్రేక్షకపాత్రే
- వారు చరిత్రహీనులు.. రాజకీయ సమాధి తప్పదు
- గట్టుప్పల్‌లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజం
గట్టుప్పల్, నవంబర్ 19: ‘నాగార్జున సాగర్ నుంచి ఆంధ్ర నీటిదోపిడీపై కేఆర్ఎంబీకి లేఖ రాశానని చెప్తున్న సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఆ లేఖ ఎప్పుడు రాశారో? బహిర్గతం చేయాలి. లేదంటే ముకు నేలకు రాసి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సాగర్ నుంచి ఏపీ నీటిని తరలించుకుపోతుంటే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమటిరెడ్డి వెంకట్ రెడ్డిల పై నిప్పులు చెరిగారు. సాగర్ వద్ద ఏపీ నిర్మాణాలపై మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెరో ప్రకటన ఇచ్చారని, అందులో ఏది నిజమో వారే చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మన నీళ్లను ఆంధ్రాకు కట్టబెట్టి చరిత్రహీనుడిగా మిగిలావ్ ఉత్తమ్. నిన్ను జిల్లా ప్రజలు క్షమించరు. నీకు రాజకీయ సమాధి తప్పదు’ అని హెచ్చరించారు. సమైక్యాంధ్రలో జరిగిన విధంగానే మన సాగర్ నీళ్లను ఏపీ సీఎం చంద్రబాబు దోచుకొని పోతున్నాడని విమర్శించారు. విజయపురి సౌత్ వద్దే ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మాణ పనులు చేస్తుంటే నువ్వు గుడ్డి గుర్రాల పళ్ళు తోముతున్నావా ఉత్తుత్తి ఉత్తమ్? చేతకాని ఉత్తమ్.. ఇలాంటి అన్‌ఫిట్ మంత్రిని ఇప్పటివరకూ నేను చూడనేలేదు’ అని ధ్వజమెత్తారు.
సీఎం, మంత్రుల మధ్య సమన్వయం లేదు
ముఖ్యమంత్రికి, మంత్రులకు సమన్వయం లేదని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఎవరికి వారు దోచుకోవడం, కమీషన్లు మింగడం పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. అసలు రాష్ట్రంలో పాలన ఉన్నదా? అని ప్రశ్నించారు. ‘ఆంధ్రాలో క్రాప్‌హాలిడే లేదు. మరి తెలంగాణలో ఎలా ప్రకటిస్తారు. సిగ్గు అనిపించడం లేదా రేవంత్‌రెడ్డి నీకు’ అని నిలదీశారు. ఉన్న నీళ్లను ఆంధ్రాకు, నీ గురువు చంద్రబాబుకు తాకట్టు పెట్టి ఇకడ క్రాప్‌హాలిడే అంటున్నావని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చాకే మూడేళ్లుగా నాగార్జునసాగర్ పరాయి పాలన చేతుల్లోకి పోయిందని, కేఆర్ఎంబీని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు సాగర్‌పై పెత్తనం చెలాయిస్తూ నీళ్లను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు.
ఉత్తమ్, వెంకట్ రెడ్డి పొంతన లేని మాటలు
సాగర్ మధ్యలో నుంచి సొరంగం తవ్వి చంద్రబాబు నీళ్లు తీసుకుపోతున్న విషయం మీకు తెలుసా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగితే.. మంత్రి వెంకట్‌రెడ్డి సమాచారం లేదని, ఈఈ ఆంధ్రావాడు తప్పయిందని ఒప్పుకొన్నాడని అన్నారని చెప్పారు. అంతా తెలుసు, అభ్యంతరం చెప్తూ ఉత్తరం రాశానని మరో మంత్రి ఉత్తమ్ మాత్రం అబద్ధపు మాటలు చెప్తున్నారని, ఇద్దరు మంత్రులు పొంతన లేకుండా మాట్లాడుతూ దొరికిపోయారని ఎద్దేవా చేశారు.
మన నీళ్లను, జలహక్కులను కాపాడుకుంటాం
రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్న నాటకాన్ని అర్థం చేసుకోవాలని జగదీశ్‌రెడ్డి హితవు పలికారు. సాగర్ నీటికోసం బీఆర్ఎస్ పార్టీ ఎంతకైనా పోరాడుతుందని స్పష్టంచేశారు. భూకంప సృష్టించి అయినా మన నీళ్లను, మన హక్కులను కాపాడుకుంటామని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా రైతాంగానికి ప్రతి ఎకరాకు నీరందించామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. అప్పుల ఊబిలో చికుకొన్న సాగర్ రైతాంగాన్ని బయటపడేశామని, కానీ కాంగ్రెస్ పాలన వచ్చి మళ్లీ అప్పుల్లో నెట్టేసిందని పేర్కొన్నారు. మొదటి నుంచి తాము చెప్తున్నా కాంగ్రెస్ పాలకులు వినకుండా, సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే సాగర్ పరాయి పాలకుల చేతుల్లోకి పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

