రంగారెడ్డి, సెప్టెంబర్ 15 (నమస్తేతెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 22ఏ నిషేధిత జాబితా ప్రకంపనలు బాధితులను ఇంకా వెంటాడుతూనే ఉ న్నాయి. నిషేధిత భూముల జాబితా త యారీలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టా భూములు సైతం అందులోకి వెళ్లా యి. తమ భూములను నిషేధిత జాబితా నుంచి కాపాడుకోవడం కోసం బాధితు లు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవడానికి క్యూకడుతున్నారు. ఫలితంగా వారం రోజులుగా రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో ఈకేవైసీ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో భూ బాధితులు అయోమయానికి గురవుతున్నా రు. మరోవైపు జాబితాలో దొర్లిన తప్పులను సవరించుకుంటూ తహసీల్దార్లు ఇటీవల పట్టా భూముల వివరాల ను కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అయినప్పటికీ అవి ఏ పరిస్థితుల్లో ఉ న్నాయో తెలియక అధికారులు సైతం అయోమయానికి గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 22ఏ నిషేధిత జాబితా బాధితులు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, బాలాపూర్, కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్, రాజేంద్రనగర్, గండిపేట్, శేరిలింగంపల్లి, శంకర్పల్లి, మొయినాబాద్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇండ్లు, ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు టీఎం 15కింద దరఖాస్తు చేసుకునేందుకు మీసేవ కేంద్రాలకు వెళ్తే ఈ కేవైసీలు పనిచేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.