RS Praveen kumar | సాక్షాత్తు మల్లు భట్టి విక్రమార్క్ డిపార్ట్మెంట్లో ఘోరం జరిగిందని.. ఆయన శాఖలో జరిగిన భారీ స్కాంను బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయటపెట్టారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయమై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. 2016లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రాన్స్ కోలో అంటే విద్యుత్ శాఖలో ఉండే ప్రతీ టెండర్‌ను ఎస్సీలకు 15%, బీసీలకు 27%, ఎస్టీలకు 10% కాంట్రాక్టులు ఇవ్వాలని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. ఇచ్చింది కూడా అన్నారు. 100 కాంట్రాక్టులుంటే బరాబర్ 15%, బీసీలకు 27%, ఎస్టీలకు 10% వచ్చేవి. దీనికి రోస్టర్ పద్దతిన ఇచ్చారు. మాకు నిన్న, ఈ రోజు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన కాంట్రాక్టర్లు ఈ రోజు జనతాగ్యారేజ్ అని పిలవబడుతున్న ఈ తెలంగాణ భవన్‌కు వచ్చి వాళ్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
కేసీఆర్ టైంలో 33/11 అంటే సబ్ స్టేషన్లు మాకు రోస్టర్ పద్దతిలో ఇచ్చేశారు. ఒక్కో సబ్ స్టేషన్ వర్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి దాదాపు 1.5-2 కోట్ల రూపాయలు వస్తాయి. మెటీరియల్ అంతా కూడా డిపార్ట్మెంట్ వనరుల నుంచి వస్తుంది.. కానీ ఈ రోజు వాళ్ల పొట్ట కొట్టిర్రు. కేసీఆర్ హయాంలో రోస్టర్ పద్దతి పాటించి వీళ్లకు టెండర్లు ఇస్తూనే వాళ్లకు ఈఎండీ కూడా రద్దు చేశారు. కానీ ఈ రోజు 300 సబ్స్టేషన్ల నిర్మాణ కాంట్రాక్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాల్సి వస్తుందని కుట్ర చేస్తున్నారని.. అందుకే సబ్స్టేషన్లను ప్రత్యేక ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టులు వారికి రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన భట్టి విక్రమార్క శాఖలోని ఆ వర్గానికి అన్యాయం జరిగితే ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది..? అని ప్రశ్నించారు. నల్గొండ పరిధిలోని సబ్‌స్టేషన్ నిర్మాణ కాంట్రాక్టులను కోమటిరెడ్డి పృథ్వీ రెడ్డికి చెందిన లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ సంస్థకు ఇచ్చారన్నారు.
భట్టి విక్రమార్క శాఖలో భారీ స్కాం బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
2016లో ట్రాన్స్‌కో టెండర్లలో ఎస్సీలకు 15%, బీసీలకు 27%, ఎస్టీలకు 10% కాంట్రాక్టులు ఇవ్వాలని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది
కానీ ఈరోజు 300 సబ్స్టేషన్ల నిర్మాణ కాంట్రాక్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు… pic.twitter.com/ThkAKXDw22
— Telugu Scribe (@TeluguScribe) September 29, 2026
Allu Arjun | భార్యతో అల్లు అర్జున్ రొమాంటిక్ మూమెంట్.. స్నేహారెడ్డికి బన్నీ స్పెషల్ విషెస్ వైరల్!
Srinivas Reddy | ప్రజలవిశ్వాసమే.. జర్నలిస్టులకు రక్షణ.. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
కడు పేదరికం నుండి యువ ద్రోణాచార్యుడిగా పొన్నాల పృథ్వీరాజ్