Srinivas Reddy | బాన్సువాడ, సెప్టెంబర్ 29 : సమాజం లో ప్రజల విశ్వాసం తోనే జర్నలిస్ట్ లకు రక్షణ ఉంటుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ లో ఎస్ ఆర్ ఎన్ కే డిగ్రీ కళాశాలలో మంగళవారం కామారెడ్డి జిల్లా విలేకరులకు పునశ్చరణ తరగతులు నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి, రాష్ట్ర, జాతీయ గీతాలను ఆలపించారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో పత్రికలు ఉండేవని, తదనంతరం టీవీలు వచ్చాయని, ఆ సమయంలో పత్రికల మనుగడ కష్టం అనుకునే పరిస్థితి ఎదురైందని చెప్పారు. కానీ మీడియా ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతోందని చెప్పారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిజం వృతి అనేది కత్తిమీద సాములాంటిదని, బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఓఎస్డీ రెహమాన్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, సొసైటీ అధ్యక్షుడు వై కృష్ణ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేణుగోపాల్, జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, సెక్రెటరీ రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.