26 లక్షల జనాభాకు ఒక ఎంపీ!
భారత్‌లో ఒక్కో లోక్‌సభ సభ్యుడు సగటున 26.3 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికాలో ఈ సంఖ్య 8.02 లక్షలే. అంటే భారత్‌లో ఒక్కో ఎంపీపై 3.3 రెట్లు అధిక జనాభా బాధ్యత ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రాధాన్యత సంతరించుకుంది.
- అమెరికాతో పోలిస్తే 3.3 రెట్లు ఎక్కువ
- 816కి పెరగనున్న లోక్‌సభ బలం
- డీలిమిటేషన్‌తో మారనున్న లెక్కలు
న్యూఢిల్లీ: భారత్‌లో ఒక్కో లోక్‌సభ సభ్యుడు సగటున 26.3 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికాలో ఈ సంఖ్య 8.02 లక్షలే. అంటే భారత్‌లో ఒక్కో ఎంపీపై 3.3 రెట్లు అధిక జనాభా బాధ్యత ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌లో 543 లోక్‌సభ స్థానాలుండగా, అమెరికా ప్రతినిధుల సభలో 435 మంది ఓటింగ్ సభ్యులు, ఆరుగురు ఓటింగ్ హక్కులేని సభ్యులున్నారు.
ఐస్లాండ్లో ఒక్కో ఎంపీ 6.39 వేల మందికి, లక్జెంబర్గ్‌లో 11.46 వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫిన్లాండ్లో ఒక్కో ఎంపీ 28.11 వేలు, స్వీడన్లో 30.66 వేలు, ఐర్లాండ్‌లో 30.79 వేలు, నార్వేలో 33.45 వేలు, డెన్మార్క్‌లో 33.65 వేలు, ఉరుగ్వేలో 34.17 వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే న్యూజిలాండ్‌లో 40.67 వేలు, స్విట్జర్లాండ్‌లో 45.04 వేలు, పోర్చుగల్‌లో 45.20 వేలు, ఆస్టియ్రాలో 49.77 వేలు, కోస్టారికాలో 90.79 వేల మంది ఒక్కో ఎంపీ పరిధిలో ఉన్నారు. బ్రిటన్‌లో ఒక్కో ఎంపీ 1.08 లక్షలు, కెనడాలో 1.18 లక్షలు, ఫ్రాన్స్‌లో 1.20 లక్షలు, నెదర్లాండ్స్‌లో 1.23 లక్షలు, జర్మనీలో 1.33 లక్షలు, ఇటలీలో 1.47 లక్షలు, దక్షిణాఫ్రికాలో 1.64 లక్షలు, ఆస్టేల్రియాలో 1.82 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తైవాన్‌లో 2.04 లక్షలు, జపాన్‌లో 2.63 లక్షలు, బ్రెజిల్లో 4.16 లక్షల మంది ఒక్కో ఎంపీ పరిధిలో ఉన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం 132వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ సభ్యుల సంఖ్యను 816కి పెంచాలని ప్రతిపాదించింది. సవరించిన స్థానాలు, నియోజకవర్గాల సరిహద్దులను 2051 వరకు స్థిరీకరించనుంది. నవంబర్ 30న లోక్‌సభ, డిసెంబర్ 2న రాజ్యసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమై, డిసెంబర్ 3న ముగియనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

