Home
National
34 Eminent Personalities Urge Centre To Introduce Delimitation Bills Only After Public Consultation
ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే బిల్లు ప్రవేశపెట్టాలి
ఆదరాబాదరగా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై పలువురు ప్రముఖులు, మేధావులు, హక్కుల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
- కేంద్రానికి మేధావులు, హక్కుల కార్యకర్తల లేఖ
న్యూఢిల్లీ, నవంబర్ 29: ఆదరాబాదరగా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై పలువురు ప్రముఖులు, మేధావులు, హక్కుల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగం (132వ సవరణ) బిల్లు-2026, డీలిమిటేషన్ (రెండో) బిల్లులపై తగిన ప్రజా సంప్రదింపులు జరిపే వరకు వాటిని వాయిదా వేయాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్, రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా, ఆర్థికవేత్త జయంతి ఘోష్‌తోపాటు 34 మంది ప్రముఖులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు శనివారం వారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు ఒక లేఖ రాశారు. ఈ బిల్లులపై ప్రజల పరిశీలనకు, అభిప్రాయాల సేకరణకు దాదాపు సమయమే మిగలలేదని పేర్కొన్నారు. రెండు ముసాయిదా బిల్లులను కనీసం 30 రోజులపాటు ప్రజల ముందుంచాలని, దానిపై చర్చ జరగాలని వారు కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

