వీధి అరుగులు
ఆవేదన అలలై అంతరంగాన్ని
అతలాకుతలం చేసినప్పుడల్లా,
అలసిన అడుగులకు ఆలంబనైనవి
ఆ వీధి అరుగులే.
మాటల్లో చెప్పలేని మనోవేదనను,
మౌనంగా చెక్కిలి నుండి జారే కన్నీళ్లను,
ఓర్పుతో ఆలకించే శక్తి ఆ అరుగులకే సొంతం.
కన్నవారు కాదుపొమ్మంటే
వారి కళ్లలో వెలుగు కరిగిన కథలు,
ఒంటరి గుండెల్లో వేదన మిగిల్చిన జ్ఞాపకాలు
ఎన్నో నిరీక్షణల నిశ్శబ్ద నిట్టూర్పులు
అన్నీ ఆ అరుగుల మీదే ఆశ్రయం పొందాయి.
బంధాలు దూరమై బాధలో ఉన్నప్పుడు
ఆ బాధలు పంచుకునే ఆత్మీయ వేదికలు
ఆ అరుగులే కదా!
నేడు బాధలు చెప్పుకునే వృద్ధులే లేరా అని
ఆ అరుగులెందుకో చిన్నవోయినాయి.
-కోట దామోదర్ ,9391480475
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

