వెల్లివిరిసిన ఉద్యమస్ఫూర్తి
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక మలుపుగా నిలిచిన ‘దీక్షా దివస్'ను ఆదివారం గ్రేటర్‌వ్యాప్తంగా ఉత్సాహపూరితంగా జరుపుకొన్నారు. తెలంగాణ భవన్‌తో పాటు ప్రధాన కూడళ్లలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
- పరాయి పాలన సంకెళ్లు తెంచిన యోధుడు కేసీఆర్
- కేసీఆర్ దీక్షతో రగిలిన ఉద్యమ స్ఫూర్తి
- ఢిల్లీ మెడలు వంచి, పరాయి పాలన సంకెళ్లు తెంచిన యోధుడు కేసీఆర్
- ఆయన తెగువ, పట్టుదలే నేటి తరానికి ఆదర్శం
- పలు చోట్ల కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
- వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నేతలు
సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక మలుపుగా నిలిచిన ‘దీక్షా దివస్’ను ఆదివారం గ్రేటర్‌వ్యాప్తంగా ఉత్సాహపూరితంగా జరుపుకొన్నారు. తెలంగాణ భవన్‌తో పాటు ప్రధాన కూడళ్లలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. స్వరాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రదర్శించిన అసమాన తెగువ, మొక్కవోని పట్టుదల నేటితరానికి స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ నేతలు అన్నారు. పరాయి పాలన సంకెళ్లను తెంచి తెలంగాణకు విముక్తి కల్పించిన యోధుడు కేసీఆర్ అని కొనియాడారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో నాటి ఉద్యమస్ఫూర్తిని మరోసారి రగిలించి..రాష్ట్ర అస్తిత్వాన్ని, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. గ్రేటర్‌వ్యాప్తంగా కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదానం నిర్వహించారు.
దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేస్తూ.. ఢిల్లీ పాలకుల మెడలు వంచిన చారిత్రక ఘట్టం దీక్షా దివస్ వేడుకలను గ్రేటర్ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే తెగింపుతో 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా నగరంలోని పలు కూడళ్లలో తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు నాటి ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. పరాయి పాలన సంకెళ్లను తెంచి, తెలంగాణకు విముక్తి కల్పించిన అసలు సిసలైన యోధుడు కేసీఆర్ అని కొనియాడారు.
-సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ)
ప్రాణాలను సైతం పణంగా పెట్టి కేసీఆర్ చేసిన ఆమరణ దీక్షతోనే యావత్ తెలంగాణ సమాజం ఏకమై ఉవ్వెత్తున ఎగిసిపడిందని, ఫలితంగానే కేంద్రం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసిందని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పేరొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నాటి ఉద్యమ స్ఫూర్తిని మరోసారి రగిలించాల్సిన అవసరం ఉందని నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ అస్తిత్వాన్ని, హకులను కాపాడుకునేందుకు ప్రతి ఒకరూ తెలంగాణకు పునరంకితం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. స్వరాష్ట్ర సాధనలో కేసీఆర్ చూపిన తెగువ, పట్టుదలే నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి కేసీఆర్ దీక్షా స్ఫూర్తిని చాటి చెప్పారు.
నిరాహార దీక్షతో కల ఫలించింది..
కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షతో ఏండ్ల నాటి తెలంగాణ ప్రజల కల ఫలించిందని, ప్రత్యేక రాష్ట్ర సాకారం అయిందని ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌లో జాతీయ రహదారి పక్కన బీఆర్ఎస్ నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షే కీలకమని బీఆర్ఎస్ ఎల్పీవిప్,కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్‌రాజు,మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం బీఆర్ఎస్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధి, గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం(జిల్లా తెలంగాణ భవన్)లో నిర్వహించిన దీక్షాదివస్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్చార్జి మాగంటి సునీతాగోపీనాథ్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి యూసుఫ్‌గూడ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం రాష్ట్ర సాధనకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన తెలంగాణ బాపు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్వాన్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు,ఉద్యమ కారులు కేసీ శేఖర్ రెడ్డి, కోడూరి శ్రీధర్‌సాగర్,యాద శ్రీనివాస్ గుప్తాలు తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌కుమార్‌తో కలిసి తెలంగాణ ఉద్యమ కారులకు నివాళుల ర్పించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారని గుర్తు చేశారు.
ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తాలో డివిజన్ అధ్యక్షుడు గజ్జెల ఆనంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన్నె గోవర్ధన్ రెడ్డి హాజరై ఉద్యమ సారధి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో రోగులకు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, బీఆర్ఎస్ నేతలు పండ్లను పంపిణీ చేశారు. నింబోలిఅడ్డా దీక్షా దివస్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ , కంటోన్మెంట్లో మన్నె క్రిశాంక్ కార్యకర్తలతో సంకల్ప ప్రతిజ్ఞ చేశారు. చర్లపల్లి డివిజన్, చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్2లోని పారిశ్రామికవేత్తల భవనంలో కేసీఆర్ దీక్షా దివస్‌లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తెలంగాణ తల్లి విగ్రహం, అమరవీరుల స్థూపం వద్ద మాజీ మేయర్ జక వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్ర సాధన
ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్‌లో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా తెలంగాణ ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్, మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలకు ప్రత్యేక రాష్ట్ర సాధనే మార్గమని 2001 లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారని గుర్తు చేశారు.
రాష్ట్ర ఏర్పాటు కోసం సకల జనుల సమ్మె, వంట వార్పు, సాగర హారం వంటి అనేక పోరాటాలు చేసినప్పటికీ నాటి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు ను కాలయాపన చేసిందని పేరొన్నారు. దీంతో కేసీఆర్ తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29 వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ఆ దీక్ష అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసిందని, దాంతో నాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ లతో కలిసి తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. బడంగ్పేట్ పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్లో దీక్షా దివస్ కార్యక్రమం సందర్భంగా చందన చెరువు దగ్గర ఉన్న అమర వీరుల స్తూపం వద్ద ఎమ్మెల్సీ వాణీదేవి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ ,బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అమర వీరులకు నివాళులర్పించారు.
బాలాపూర్ చౌరస్తాలోని మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, జగీజవన్ రాం, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. బడంగ్పేట్ పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్‌కు ర్యాలీగా వచ్చి ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. సికింద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సాధనలో జరిగిన అనేక సం ఘటనలను ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ గుర్తు చేసుకున్నారు.

నేరేడ్మెంట్లోని దీక్షా దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి

ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తదితరులు

చర్లపల్లి పారిశ్రామికవాడలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తదితరులు

తెలంగాణ స్థూపం, ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేతలు

మేడిపల్లిలో అమర వీరుల స్థూపం వద్ద దీక్షా దివస్‌లో పాల్గొన్న మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు

యూసుఫ్‌గూడ అంబేద్కర్ కూడలిలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్చార్జి మాగంటి సునీతాగోపీనాథ్

అమరవీరుల చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, బీఆర్ఎస్ శ్రేణులు

తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మన్నె క్రిశాంక్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నాగేశ్ తదితరులు

చర్లపల్లి సీఐఏ భవనంలో కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

దీక్షాదివస్‌లో పాల్గొని నేతలు,కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ఆల్విన్ కాలనీ డివిజన్లో పార్టీ నేతలతో దీక్షా దివస్‌లో పాల్గొన్న బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి సతీశ్‌రావు

శంషాబాద్‌లో నిర్వహించిన దీక్షాదివస్‌లో బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్లాడుతున్న కార్తిక్‌రెడ్డి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

