రాజ్యసభ ప్రాతినిధ్యానికి కోత!
డీలిమిటేషన్ బిల్లుతో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 816కి పెంచేందుకు కేంద్రం కసరత్తులు చేస్తున్నది. ఈ తరుణంలోనే రాజ్యసభ సీట్లను మాత్రం ప్రస్తుతం ఉన్న 245 వద్దే కొనసాగించడం ఐదు కీలకమైన రాజ్యాంగపరమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నది.
- పెద్దల సభ సీట్లు పెంచకపోతే రాజ్యాంగ సమతుల్యతపై దెబ్బ
- ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు
న్యూఢిల్లీ, నవంబర్ 29: డీలిమిటేషన్ బిల్లుతో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 816కి పెంచేందుకు కేంద్రం కసరత్తులు చేస్తున్నది. ఈ తరుణంలోనే రాజ్యసభ సీట్లను మాత్రం ప్రస్తుతం ఉన్న 245 వద్దే కొనసాగించడం ఐదు కీలకమైన రాజ్యాంగపరమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నది.
ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల నిష్పత్తి 2.2:1గా ఉంది. లోక్‌సభ సభ్యుల సంఖ్యను 816కి పెంచితే ఈ నిష్పత్తి 3.47:1గా మారుతుంది. దీంతో రాజ్యసభ వాటా 31.1 నుంచి 22.4 శాతానికి పడిపోతుంది. ఇది భారత సమాఖ్య వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సంస్థాగత ప్రాధాన్యతను గణనీయంగా తగ్గిస్తున్నది.
లోక్‌సభ ఆధిపత్యం పెరగడం..
బిల్లుల విషయంలో లోక్‌సభ, రాజ్యసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు దాన్ని పరిష్కరించేందుకు ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తారు. అయితే లోక్‌సభ ఎంపీల సంఖ్య 816కి పెరిగితే ఉమ్మడి సమావేశాల్లో ఆ సభదే ఆధిపత్యం అవుతుంది. దీంతో రాజ్యసభకు చర్చల్లో, నిర్ణయాల్లో ప్రభావం చూపే అవకాశం తగ్గుతుంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రభావం తగ్గడం..
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఓట్లేస్తారు. కానీ లోక్‌సభ ఎంపీల సంఖ్య పెరిగి, రాజ్యసభ ఎంపీలు ఇప్పుడున్నంత వరకే ఉంటే.. ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడంలో రాజ్యసభకున్న ప్రాధాన్యత తగ్గిపోతుంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రభావం తగ్గడం..
లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలో రాజ్యసభకు ఉన్న వాటా తగ్గుతుంది. అప్పుడు రాష్ట్రపతి ఎన్నిక ఎక్కువగా లోక్‌సభ, శాసన సభ్యుల మీదనే ఆధారపడుతుంది.
రాష్ర్టాల గొంతుక ప్రశ్నార్థకం..?
జాతీయ పాలనలో రాష్ర్టాల గొంతుకను, వాటి ప్రయోజనాలను కాపాడటం రాజ్యసభ ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. కానీ రాజ్యసభ సభ్యులను ఇప్పుడున్నంత వరకే పరిమితం చేస్తే.. రాష్ర్టాల గొంతుక వినిపించడం తగ్గుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మహిళా ప్రాధాన్యత విషయంలో ప్రశ్న?
రాజ్యసభలో సభ్యుల సంఖ్య పెంచకపోతే ఇక్కడ మహిళల రిజర్వేషన్లు పెరగవు. అది రాజ్యాంగ విధానాన్నే ప్రశ్నిస్తుందని మేథావులు అంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

