రైతన్నల గుండెల్లో.. భూసేకరణ గుబులు.. ఇదేనా ప్రజా పాలన ?
రీజినల్ రింగ్ రోడ్డు సౌత్ కారిడార్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. హెచ్ఎండీఏ ప్రతిపాదనల మేరకు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో భూసేకరణకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసింది.
- ‘ట్రిపులార్’కు రంగం సిద్ధం.. సౌత్ కారిడార్‌కు నోటిఫికేషన్
- 49 గ్రామాల్లో 2,885 ఎకరాలు సేకరించేందుకు కసరత్తు
సిటీబ్యూరో, నవంబర్ 29(నమస్తే తెలంగాణ) : రీజినల్ రింగ్ రోడ్డు సౌత్ కారిడార్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. హెచ్ఎండీఏ ప్రతిపాదనల మేరకు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో భూసేకరణకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసింది. దీంతో ఈ ప్రాంతాల్లోని రైతులకు మరోసారి భూసేకరణ గుబులు పట్టుకుంది. రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 49 గ్రామాల్లో 2,885 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
2027 మార్చి నాటికి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని రెవెన్యూ యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని షాద్‌నగర్, కందుకూరు, ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 28 గ్రామాల్లో 1,869 ఎకరా లను సేకరించనున్నారు. 75.67 కిలోమీటర్ల రహదారి నిర్మాణం కోసం ఈ భూమిని తీసుకోను న్నారు. ఇక వికారాబాద్ జిల్లా పరిధిలో మోమిన్ పేట, నవాబ్‌పేట, పూడూరు, వికారాబాద్ మండలా ల్లోని 21 గ్రామాల్లో సుమారు 1,016 ఎకరాలను సేకరించేందుకు జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. వికారాబాద్ ఆర్డీఓను భూసేకరణ అధికారిగా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ)ను ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు.
సామాజిక ప్రభావ అంచనా లేకుండానే…
2013 భూసేకరణ చట్టం, తెలంగాణ సవరణ చట్టం కింద ఈ ప్రక్రియను చేపడుతున్నారు. అయితే, ఈ చట్టంలోని 2, 3 అధ్యాయాల నిబంధనల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దీనివల్ల సాధారణంగా నిర్వహించే సామాజిక ప్రభావ అంచనా, నిపుణుల బృందం పరిశీలన లేకుండానే భూసేకరణ ముందుకు సాగే అవకాశం ఏర్పడింది. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హెచ్ఎండీఏ చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లకు భూములు ఇచ్చేది లేదనీ తేల్చి చెబుతుండగా… తాజాగా రీజనల్ రింగు రోడ్డు కోసం పచ్చని పంట పొలాలను లాక్కోవడంపై ఆందోళన చెందుతున్నారు.
మూడు దశల్లో ప్రక్రియ..
ముందుగా ప్రభుత్వ భూములను గుర్తించి, అవసరమైన చోట ప్రైవేటు పట్టా భూములను సేకరించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రక్రియను మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో గ్రామ సభలు నిర్వహించి రైతులు, భూయజమానుల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. రెండో దశలో అభ్యంతరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేసిన తర్వాత సర్వే, యాజమాన్య హకుల ధ్రువీకరణ చేపడతారు. మూడో దశలో అర్హులైన భూయజమానులకు నష్టపరిహారం నిర్ణయించి చెల్లిస్తారు. ఒకవైపు భూసేకరణ జరుగుతుండగానే, మరోవైపు హెచ్ఎండీఏ అధికారులు తుది డీపీఆర్ సిద్ధం చేయనున్నారు.
ట్రిపులార్‌తో రేడియల్ రోడ్లు..
కొంగరకలాన్-ఆమన్‌గల్ మధ్య 42 కి.మీల మేర రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు, బుద్వేల్-కొడంగల్ మధ్య 81 కిలోమీటర్ల మేర మరో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డును ట్రిపులార్‌తో సమాంతరంగా నిర్మించనున్నారు. భూములు లాక్కోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భూముల్లో సర్వే నిర్వహిస్తూ భయాందోళనలు కలిగిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

