కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు!
2001లో తెలంగాణ ఉద్యమం ఉధృతి ఏ విధంగా ఉప్పొంగిందో.. 2026 నవంబర్ 29న అదే లావాలా ఉప్పొంగుతున్న జనసముద్రాన్ని చూస్తుంటే అంతే సంతోషంగా ఉన్నది. దీక్షా దివస్ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.
2001లో తెలంగాణ ఉద్యమం ఉధృతి ఏ విధంగా ఉప్పొంగిందో.. 2026 నవంబర్ 29న అదే లావాలా ఉప్పొంగుతున్న జనసముద్రాన్ని చూస్తుంటే అంతే సంతోషంగా ఉన్నది. దీక్షా దివస్ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఏ చరిత్ర పుటలు చూసినా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని రెండు అధ్యాయాలు ఉంటాయి. కానీ, తెలంగాణలో మాత్రం కేసీఆర్ దీక్షకు పూర్వం, కేసీఆర్ దీక్ష తర్వాత అని రెండు శకాలు ఉన్నాయి. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు. ఇదే కరీంనగర్ గడ్డ సాక్షిగా 2001లో కేసీఆర్ ఒక మాట అన్నడు.
తెలంగాణ ఉద్యమం చేద్దామన్న వాళ్ల చేతిలో అనేకసార్లు ప్రజలు మోసపోయిన్రు. ఓ తెలంగాణ ప్రజలారా.. తెలంగాణ తీసుకురాకుంటే నన్ను రాళ్లతో కొట్టిచంపండి’ అంటూ అదేరోజు జేబులో మరణవాంగ్మూలాన్ని రాసిపెట్టుకున్నడు. ప్రతి ఒక్కరిలో అదే మాట.. కళాకారులు పాడినా అదే అదే పాట.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. చివరికి తనను తాను బలి ఇవ్వదలచుకుని ఒక నినాదంతో కేసీఆర్ అడుగుపెట్టిన అలుగునూర్ మట్టికి శిరస్సువంచి మొక్కుతున్నా.
ఈ దీక్షాస్ఫూర్తి సభ సాక్షిగా రామన్నను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ రోజు ఒక సింహం గర్జించి తెలంగాణ తీసుకొచ్చింది. పదేండ్లలో కేసీఆర్ చల్లని పాలనలో కరువు అనే పదం లేకుండా, నీళ్ల తిప్పలు లేకుండా సల్లగ బతికిన తెలంగాణ, ఇప్పడు సమైక్యపాలన కన్నా ఘోరంగా ఉన్నది. మళ్లీ కేసీఆర్ పాలనను తీసుకువద్దామన్న మీ సంకల్పానికి మరోసారి ధన్యవాదాలు.
– రసమయి బాలకిషన్, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

