కేసీఆర్ దీక్షా బలం..నేటి తెలంగాణ రాష్ట్రం
‘కేసీఆర్ దీక్షా బలం.. అమరవీరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ రాష్ట్రం..’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. దీక్షా దివస్‌ను పురస్కరించుకొని ఆదివారం ఎక్స్ వేదికగా సందేశమిచ్చారు.
- బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ దీక్షా బలం.. అమరవీరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ రాష్ట్రం..’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. దీక్షా దివస్‌ను పురస్కరించుకొని ఆదివారం ఎక్స్ వేదికగా సందేశమిచ్చారు. కేసీఆర్ నిరాహారదీక్ష తరతరాల ఆకాంక్షను నెరవేర్చిందని వ్యాఖ్యానించారు. ఆత్మబలమే ఆయుధంగా, వాక్శక్తే ఇంధనంగా, నిజాయతీ, నిబద్ధతలే కవచకుండలాలుగా తెలంగాణ పోరాటాన్ని విజయతీరం చేర్చిన యోధుడు కేసీఆర్ అని కొనియాడారు.
ప్రాణాలను పణంగా పెట్టి దీక్షబూని ఢిల్లీ గద్దెను వణికించారని పేర్కొన్నారు. ఆర్ధ శతాబ్దాపు ఆకాంక్షను సాకారం చేసి తెలంగాణకు ఆవిష్కరించారని ఉద్ఘాటించారు. ‘భూమిపుత్రుల పోరాట చరిత్రలో చెరగని మూడు అక్షరాలు కేసీఆర్.. ప్రగతి సంతకం కేసీఆర్.. భవిష్యత్తు తరాల్లో సైతం స్ఫూర్తిని వెలిగించే ఉద్యమపాఠం కేసీఆర్..’అని అభివర్ణించారు. కేసీఆర్ అంటే తెలంగాణ గర్వం.. కేసీఆర్‌కు తెలంగాణే సర్వస్వమని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

