మంత్రి పదవిపై రాజగోపాల్ యూటర్న్!
- నియోజకవర్గ అభివృద్ధికి ఇక నిధుల సాధనపైనే దృష్టి
- ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యత వహించాల్సి వస్తుందనే వెనుకడుగు
- రెండేండ్లలో ఏమీ చేయలేమనే ఆలోచన.. అధిష్ఠానం వద్ద రాజగోపాల్‌రెడ్డి కొత్త ప్రతిపాదన
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): మునుగోడు కాంగ్రెస్ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నట్టు తెలుస్తున్నది. ఇన్నాళ్లు మంత్రి పదవి కోసం సొంత ప్రభుత్వంపైనా, సీఎం రేవంత్‌పైనా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ఇప్పుడు ‘నాకు మంత్రి పదవి వద్దు.. నా నియోజకవర్గ అభివృద్ధికి నిధు లు ఇస్తే చాలు’ అనే కొత్త పల్లవి అందుకున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి బీఎం సందీప్‌కుమార్‌తో జరిగిన భేటీలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది.
మిగిలింది కేవలం రెండేండ్లు మాత్ర మే కావడం, అందులోనూ ఏడాది తర్వాత ఎన్నికల వేడి మొదలవుతుండటంతో ఈ తకువ సమయంలో మంత్రిగా బాధ్యత లు తీసుకున్నా ప్రజలకు చెప్పుకోదగ్గ పను లు ఏమీ చేయలేమనే ఆలోచనలో రాజగోపాల్‌రెడ్డి ఉన్నట్టు సమాచారం. పైగా, ఇంతకాలం నియోజకవర్గ సమస్యల కోసమే పోరాడానని చెప్తూ వచ్చి, ఇప్పుడు మంత్రి గా బాధ్యతలు చేపడితే కేవలం పదవి కోసమే ఇంతకాలం గొడవ పడ్డాననే అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. ప్రస్తు త పరిస్థితుల్లో పదవి తీసుకున్నా భవిష్యత్తు రాజకీయాలకు అది ఇబ్బందిగా మారుతుందనే వెనకి తగ్గినట్టు సమాచారం.
ప్రభుత్వ వైఫల్యాలు తన మెడకు
మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలు, పాలనాపరమైన లోపాల వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండటంతో ఈ సమయంలో మంత్రివర్గంలో చేరడం అంత శ్రేయసరం కాదని రాజగోపాల్‌రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. ఇతర నియోజకవర్గాలకు నిధులు ఇస్తూ మునుగోడును పూర్తిగా విస్మరించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడం వంటి అంశాలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆయన గతంలోనే బహిరంగంగా వి మర్శించారు.
ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి పదవి తీసుకుంటే ప్రభుత్వ వైఫల్యాలకు తాను కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని, భవిష్యత్తులో అది తన రాజకీయ మనుగడకే ప్రమాదకరమని వెనుకడుగు వేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను పకనపెట్టి ఫిరాయింపుదారులకు కీల క పదవులు కట్టబెట్టడం, అవినీతి ఆరోపణ లు పెరగడం వంటి పాలనాపరమైన లోపాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదనే అంచనాతోనే ఆయన ఇప్పుడు మంత్రి పదవికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
నియోజకవర్గంపైనే దృష్టి
వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలువాలంటే ఇప్పుడు మంత్రి పదవి కంటే మునుగోడు లో ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి నిధులు తీసుకురావడమే అత్యంత ముఖ్యమని రాజగోపాల్‌రెడ్డి నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రులుగా ఉండటంతో సామాజికవర్గ సమీకరణాలరీత్యా తనకు పదవి దకడం కష్టమని అధిష్ఠానం కూడా ఆయనకు సంకేతాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వచ్చేలా చూస్తామని పార్టీ ఇన్చార్జి హామీ ఇవ్వడంతో రాజగోపాల్‌రెడ్డి మెత్తబడినట్టు కనిపిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

