తాండూరు ఎమ్మెల్యే భూకబ్జాల నుంచి కాపాడండి
- ‘పీటీ’ హక్కులున్నా 51 ఎకరాల భూముల రికార్డులు మార్చి లాక్కొంటున్న మనోహర్‌రెడ్డి
- అధికారాన్ని ఉపయోగించి అన్యాయం చేస్తున్నడు
- సమగ్ర విచారణ జరిపించాలని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌కు తుమ్మలూరు రైతుల వినతి
హైదరాబాద్/రంగారెడ్డి, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఫ్యూచర్‌సిటీ పరిధిలోని వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం తుమ్మలూరులో తాండూరు ఎమ్మెల్యే బుయ్య ని మనోహర్‌రెడ్డి సాగిస్తున్న భూకబ్జాల పర్వం పై సమగ్ర విచారణ జరిపించాలని బాధిత రైతులు ఆదివారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. తుమ్మలూరులో సర్వే నంబర్లు 371, 372, 373లో తమకు పూర్వీకుల నుంచి సంక్రమించిన 51.02 ఎకరాలపై తమకు పీటీ(రక్షిత కౌలుదారు) హక్కు ఉన్నా, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అధికారుల అండతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి భూములను కాజేయాలని చూస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. పీటీ రిజిస్టర్‌తోపాటు పాత రెవెన్యూ రికార్డుల్లో తమ తాత గద్దగూటి ఎల్లయ్య పేరు స్పష్టంగా నమోదై ఉన్నప్పటికీ, కొందరు రెవెన్యూ అధికారులు రికార్డులను తారుమారు చేస్తూ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. తమ తాతముత్తాతలు ఎన్నో ఏండ్లు గా సాగు చేస్తున్నందున ఆ హక్కులు తమకు సంక్రమించాయని తెలిపారు. ఈ భూవివాదంపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర సంస్థలు, జాతీ య మానవ హక్కుల కమిషన్‌కు, పీఎం, ముఖ్యమంత్రి కార్యాలయాలకు ఫిర్యాదు చేయగా, రాష్ట్ర విజిలెన్స్ బృందం మహేశ్వరం తహసీల్దార్ కార్యాలయంలోని వివాదాస్పద భూములను పరిశీలించిందని వివరించారు.
రైతుల వినతిపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, బాధిత రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చా రు. అధికారులతో మాట్లాడటంతోపాటు, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిపై వస్తున్న భూకబ్జా ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిషారానికి చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారని రైతులు తెలిపారు. తుమ్మలూరులో ఉన్న వివాదాస్పద పీటీ భూములకు సంబంధించి జేబీఇన్ఫ్రా, భువన్ ఇన్ఫ్రా పేరుతో ఏర్పాటు చేస్తున్న వెంచర్లలో ఎవరూ ప్లాట్లను కొని మోసపోవద్దని రైతులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బాధిత రైతులు గద్దగూటి శ్రీరాములు, మహేందర్, హరికృష్ణ, నరేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

