అలుగునూరు.. జనహోరు..!
దీక్షా దివస్ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున కదలివచ్చారు. సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోవడంతో చాలామంది రోడ్లపైనే నిలబడి కేటీఆర్ ప్రసంగాన్ని విన్నారు.
దీక్షా దివస్ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున కదలివచ్చారు. సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోవడంతో చాలామంది రోడ్లపైనే నిలబడి కేటీఆర్ ప్రసంగాన్ని విన్నారు.
నినాదాలు, కేరింతలు, గులాబీ జెండాల రెపరెపలతో అలుగునూరు పరిసరాలు గులాబీమయమయ్యాయి. నాటి ఉద్యమకాలంలో ప్రజలు ఏ విధంగా స్వచ్ఛందంగా తరలివచ్చి ఉద్యమానికి బలాన్నిచ్చారో.. అదే తరహాలో ఈ సభకు ప్రజలు పోటెత్తడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

గులాబీ పార్టీకి అండగా నిలుస్తామంటూ పిడికిలెత్తి నినదిస్తున్న ప్రజలు

కరీంనగర్ జిల్లా అలుగునూరు దీక్షా దివస్ సభలో తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని కాపాడుకుందామంటూ ప్రతిన బూనుతున్న కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు
ఉప్పొంగిన అభిమానం

తెలంగాణ సాధనలో కేసీఆర్ పోరాటాన్ని కీర్తిస్తూ ప్లకార్డులతో అభిమానుల ప్రదర్శన

కేటీఆర్‌కు దీక్షా దివస్ జ్ఞాపికను అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ రాష్త్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి
విజయ తిలకం

కేటీఆర్‌కు విజయ తిలకం దిద్దుతున్న జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ
వెల్లువెత్తిన ఉత్సాహం

అభిమాన నాయకుడు కేటీఆర్‌ను చూసిన ఆనందంలో ప్రజలు, అభిమానులు
కేటీఆర్‌ను చూడాలని..

సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్తంభాలపైకి ఎక్కి కేటీఆర్ ప్రసంగాన్ని వింటున్న ప్రజలు
కేటీఆర్ అన్నా.. ఇటు చూడు

సభలో మహిళల ఉత్సాహం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

