చీకట్లోకి జ్ఞానదీపం
- వేరేచోట స్థలం ఇచ్చేందుకు ఆసక్తిచూపని సర్కార్
- లైబ్రేరియన్ విజ్ఞప్తిపై హేళనగా మాట్లాడిన నిమ్స్ యాజమాన్యం
- ఈరోజుల్లో పుస్తకాలు ఎవరు చదువుతారంటూ ఎద్దేవా
- లైబ్రెరీని కాపాడాలంటున్న పాఠకులు, విద్యావంతులు
- నిమ్స్ అభివృద్ధి పేరుతో ఎర్రమంజిల్ లైబ్రెరీని షెడ్డులోకి మార్చిన అధికారులు
ఖైరతాబాద్, నవంబర్ 29: హైదరాబాద్ గుండెకాయ లాంటి ఎర్రమంజిల్‌లో ఓ చరిత్ర కూలిపోబోతున్నది. ఓ జ్ఞాన దీపం ఆరిపోబోతుంది. 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఎర్రమంజిల్ లైబ్రరీ నేడు రోడ్డున పడింది. పుస్తకాల కోసం, చదువు కోసం జ్ఞానం కోసం ఎంతోమంది తపించిన ఆ గ్రంథాలయం ఇప్పుడు తన ఉనికినే కాపాడుకోలేని దుస్థితిలో ఉంది. ఈ లైబ్రరీ అంటే మామూలు లైబ్రరీ కాదు. ఇది ఒక చరిత్ర. ఇది ఒక ఉద్యమం. సరోజిని దేవి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహనీయులు ఈ లైబ్రరీలోనే కూర్చొని చదివారు. ఎన్నో పుస్తకాలను తిరగేశారు. ఎన్నో ఆలోచనలకు ఇక్కడే బీజం పడింది. ఒకప్పుడు ప్రజాప్రతినిధులు సైతం ఇందులో సభ్యులుగా ఉండేవారు. సుమారు 1,800 మంది సభ్యులతో నడిచిన గ్రంథాలయం నిత్యం పాఠకులతో కలకలలాడేది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎంతోమంది ఈ లైబ్రరీలో చదవి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. పేద విద్యారులకు ఇది ఒక దేవాలయం లాంటింది. కాంపిటీటివ్ జాబ్‌ల కోసం ఫీజు కట్టి కోచింగ్‌కు వెళ్లలేని ఎంతోమందిని ఈ లైబ్రరీయే ఆదరించింది.
అభివృద్ధి పేరుతో తాత్కాలిక షెడ్డులోకి
ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఎర్రమంజిల్ లైబ్రరీని నిమ్స్ అభివృద్ధి పనుల పేరుతో తాత్కాలికంగా రేకుల షెడ్డులోనికి మార్చారు. ఇదే ప్రాంతంలో లైబ్రరీతో పాటు ఘన చరిత్ర కలిగిన ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల, ఓ ప్రైవేట్ పాఠశాల నిర్మించిన అధికారులు లైబ్రరీని మాత్రం నిర్మించకుండా వదిలివేశారు. నిబంధనల ప్రకారం గంథ్రాలయాన్ని కూడా నిర్మించాల్సి ఉందని స్థానికులు చెబుతున్నారు. అప్పటి ప్రభుత్వం ఇదే నిబంధనలతో రేకుల షెడ్డులోకి మార్చిందని కూడా తెలుపుతున్నారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన లైబ్రరీని నిర్మించాలని గంథ్రాలయ శాఖ అధికారులు ఆర్అండ్బీ, నిమ్స్ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తాత్కాలిక లైబ్రరీ ఏర్పాటు చేసే సమయంలో వందలాది పుస్తకాలను ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలోనే భద్రపరిచారు. ప్రస్తుతం ఆ పుస్తకాలు అక్కడే ఉన్నాయి కూడా.
పుస్తకాలు చదివేవారు ఉన్నారా ..
గంథ్రాలయ తొలగింపును నిలిపివేసి శాశ్వత భవనాన్ని నిర్మించాలని లైబ్రేరియన్ శనివారం నిమ్స్ ఉన్నతాధికారిని కలవగా ఆర్ఎంఓను కలవాలని సూచించిన సదరు అధికారి ఈ రోజుల్లో లైబ్రరీకి వచ్చి చదివేవారు ఉన్నారా… లైబ్రరీ అవసరమా అంటూ హేళనగా మాట్లాడినట్టు సమాచారం. అక్కడి అధికారులు కూడా పుస్తకాలు చదివేవారు ఇంకా ఉన్నారా…. అంటూ మాట్లాడినట్టు తెలుస్తోంది. అనంతరం మరో 15 రోజులు సమయం ఇస్తాం తాత్కాలికంగా ఏర్పటు చేసిన షేడ్‌లోని పుస్తకాలు ఇతర సామగ్రిని తొలగించాలని చెప్పడంతో ఆ అధికారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఈ అంశాలన్నింటిని ఉన్నతాధికారులకు చేరవేస్తున్న క్రమమంలోనే నిర్మాణ సంస్థ లైబ్రరీ ఉన్న షెడ్ పైకప్పులను తొలగించారు. ప్రస్తుతం సదరు గ్రంథాలయంలో దిన పత్రికలు, చిన్న పుస్తకాలు ఉండగానే తొలగించడంతో ఆ అధికారికి వాటిని ఎలా సంరక్షించాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.
చరిత్రను చెరిపేస్తారా….?
హైదరాబాద్‌లో ఎన్నో చారిత్రక కట్టడాలు కనుమరుగయ్యాయి. మరో చారిత్రాత్మక లైబ్రరీ కూడా అదే జాబితాలో చేరాలా…? ప్రభుత్వం వెంటనే స్పందించి ఎర్రమంజిల్ లైబ్రరీని కాపాడాలని స్థానికులు, పాఠకులు డిమాండ్ చేస్తున్నారు. పుస్తకం లేని సమాజానికి భవిష్యత్తు ఉండదు. లైబ్రరీ లేని వీధికి వెలుగు ఉండదని వాపోతున్నారు. ఎర్రమంజిల్ లైబ్రరీని రోడ్డున పడేయకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేని అంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

