పెద్ద సభతోనే సుస్థిర ప్రభుత్వం!
- చిన్న రాష్ర్టాల్లో కప్పల తకెడ రాజకీయాలు
- రాజకీయ అస్థిరత కారణంగా తరచూ మారిన ప్రభుత్వాలు
- గోవా, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్‌లో అనుభవాలు
- ఎక్కువ సీట్లుంటే ఎమ్మెల్యేల బేరసారాలకు అడ్డుకట్ట
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): తక్కువ అసెంబ్లీ స్థానాలున్న రాష్ర్టాల్లో రాజకీయ అస్థిరత రాజ్యమేలుతున్నది. ఫిరాయింపులు, కూటముల కుమ్ములాటలు, అధికార మార్పిడులకు వేదికలుగా మారుతున్నాయి. ఈశాన్య రాష్ర్టాల్లో కొద్దిమంది ఎమ్మెల్యేల వైఖరి ప్రభుత్వాల మనుగడను ప్రభావితం చేస్తున్నది. సింగిల్ డిజిట్ ఎమ్మెల్యేలు అటూఇటూ అయినా ప్రభుత్వాలే తలకిందులవుతున్నాయి. సభ పరిమాణం పెరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది.
అంటే అధికార పీఠాన్ని దకించుకోవాలన్నా, నిలబెట్టుకోవాలన్నా రాజకీయ పార్టీలు మరింత విస్తృతంగా ప్రజా మద్దతును కూడగట్టుకోవాల్సి ఉంటుంది. కొద్దిమంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాల భవిష్యత్తును శాసించే పరిస్థితులు, స్వల్ప మెజారిటీలతో ఏర్పడే రాజకీయ సంక్షోభాలు, అసమ్మతి నేతల బేరసారాలకు ఆసారం కల్పించే పరిణామాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు సానుకూల ఫలితం ఇస్తుందని, సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడుతాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఈశాన్య రాష్ర్టాల్లో కప్పల తక్కెడే
తకువ అసెంబ్లీ స్థానాలున్న ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజాతీర్పు అపహాస్యమైన సం దర్భాలు కోకొల్లలు. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న చిన్న రాష్ట్రం గోవా. ఇక్కడ 1990 నుంచి 2002 మధ్య కాలంలో 13 మంది ముఖ్యమంత్రులు మారారు. ఈ ఒక్కటి చాలు చిన్న సైజు అసెంబ్లీతో పొంచి ఉన్న అడ్డంకులను అంచనా వేసి చెప్పేందుకు. ఒకరిద్దరు ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణతో ప్రభుత్వాలు కూలిపోవడం, కొత్త కూటములు ఏర్పడటం, అధికార సమీకరణాలు తలకిందులు కావడం అకడి రాజకీయాల్లో తరచూ కనిపించింది. 2017 నుంచి 2022 మధ్య కాలంలోనూ గోవాలో 24 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
2016లో అరుణాచల్‌ప్రదేశ్‌లో 43 మం ది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పటి ముఖ్యమంత్రి పెమా ఖండూ నాయకత్వంలో పార్టీని వీడి, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌లో చేరారు. అనంతరం ఆ పార్టీలోనూ చీలిక ఏర్పడి 32 మందితో కలిసి ఖండూ బీజేపీలో చేరారు. దీంతో రాష్ట్రంలో అధికార సమీకరణాలు పూర్తిగా మారిపోయా యి. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చినా, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఒకే అసెంబ్లీ కాలంలో వరుసగా జరిగిన పార్టీ మార్పులు ప్రభుత్వ స్వరూపాన్నే మార్చేశాయి.
తెలంగాణకు సానుకూలం
తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరుగడం రాజకీయ స్థిరత్వానికి సానుకూల పరిణామం. 119 స్థానాల సభలో 60 మంది సభ్యుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడుతుండగా, 179 కి పెరిగితే సాధారణ మెజారిటీ సంఖ్య 90కి చేరుకుంటుంది. సభ పరిమాణం పెద్దది కావడం వల్ల.. కొ ద్దిమంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రభుత్వాన్ని కూల్చ డం, ఇబ్బందుల్లోకి నెట్టడం గణాంకపరం గా కష్టం. అధికార పార్టీకి 110 నుంచి 120 స్థానాలు వస్తే ప్రభుత్వానికి తిరుగులేని రాజకీయ వెసులుబాటు దకుతుం ది.
ఒకవేళ 90కి దగ్గరగా స్థానాలు వచ్చినప్పుడు అంతర్గత అసమ్మతి లేదా ప్రతిపక్షాల ఆకర్షణ మంత్రం వంటి సవాళ్లు ఎదురైనా, చిన్న రాష్ట్రాలతో పోల్చితే పెద్ద సభలో ప్రభుత్వ మనుగడకు ఎకువ భ ద్రత ఉంటుంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే భౌగోళికంగా పెద్దగా ఉన్న నియోజకవర్గాల పరిధి తగ్గుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి వేగంగా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంటుంది. వెనుకబడిన ప్రాంతాలు, సామాజికంగా తకువ ప్రాతినిధ్యం ఉన్న వర్గాలకు రాజకీయ అవకాశాలు విస్తరించవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

