జురెల్ పోరాడినా..
వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (170 బంతుల్లో 14 ఫోర్లతో 88) నాలుగు గంటల పాటు క్రీజులో నిలిచి భారత్‌కు ఫాలోఆన్ గండం తప్పించినా.. తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయిన పేస్ లీడర్ జస్ప్రీత్ బుమ్రా (2/34) మళ్లీ వికెట్ల వేట మొదలుపెట్టినా రెండో టెస్టులో న్యూజిలాండ్ ఆధిపత్యమే నడుస్తున్నది.
- న్యూజిలాండ్‌దే పైచేయి
- తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 246 ఆలౌట్
- రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 133/3
క్రైస్ట్‌చర్చ్: వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (170 బంతుల్లో 14 ఫోర్లతో 88) నాలుగు గంటల పాటు క్రీజులో నిలిచి భారత్‌కు ఫాలోఆన్ గండం తప్పించినా.. తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయిన పేస్ లీడర్ జస్ప్రీత్ బుమ్రా (2/34) మళ్లీ వికెట్ల వేట మొదలుపెట్టినా రెండో టెస్టులో న్యూజిలాండ్ ఆధిపత్యమే నడుస్తున్నది. తరుముకొస్తున్న ఓటమిని తప్పించుకునేందుకు భారత్ పోరాడుతున్నది. జురెల్ పోరాటంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 86.1 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. కైల్ జేమీసన్ (4/69) రెండు వికెట్లతో దెబ్బకొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగుల కీలక ఆధిక్యం అందుకున్న కివీస్ శుక్రవారం, మూడో రోజు ఆట చివరికి రెండో ఇన్నింగ్స్‌లో 133/3 స్కోరు చేసింది.
మొత్తంగా 243 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. డెవాన్ కాన్వే (97 బంతుల్లో 6 ఫోర్లతో 51), రచిన్ రవీంద్ర (84 బంతుల్లో 5 ఫోర్లతో 46 బ్యాటింగ్) సత్తా చాటారు. రచిన్‌తో పాటు డారిల్ మిచెల్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఈ పిచ్‌పై 300 ప్లస్ టార్గెట్‌ను ఛేజ్ చేయడం కష్టమే కానుంది. సోమవారం బౌలర్లు అద్భుతం చేస్తేనే భారత్ రేసులోకి రాగలదు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో హీరోగా నిలిచిన ఆకాశ్ దీప్ అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద లోటుగా మారనున్నది. అతని స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి వచ్చిన ప్రసిధ్ కృష్ణ 10 ఓవర్లలో 29 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయాడు.
టెయిలెండర్లతో జురెల్ పోరాటం
మూడో రోజు ఉదయం కూకబురా బంతి పాతబడటం, ఎండ తీవ్రంగా ఉండటంతో బ్యాటింగ్‌కు అనుకూల పరిస్థితులు కనిపించాయి. కానీ, ఓవర్‌నైట్ స్కోరు 116/6తో ఆట ప్రారంభమైన 15 నిమిషాల్లోనే అన్షుల్ కాంబోజ్ (0) ఖాతా తెరవకుండానే హెన్రీ (2/58) బౌలింగ్‌లో స్లిప్‌లో నికోల్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో 117/7తో నిలిచిన భారత్ కనీసం 150 పరుగులు చేస్తుందా? ఫాలోఆన్ తప్పదా? అనే సందేహాలు తలెత్తాయి. కానీ, నాలుగున్నర గంటలకు పైగా క్రీజులో పాతుకుపోయిన ధ్రువ్ జురెల్ అద్భుత పోరాటంతో జట్టును ఆదుకున్నాడు. జురెల్ బ్యాటింగ్‌లో సహనం, సరైన టెక్నిక్ కొట్టొచ్చినట్టు కనిపించాయి.
లెంగ్త్‌లో పడిన బంతులను వదిలేయడంలో అతడు చూపిన జడ్జ్మెంట్ అమోఘం. పరిస్థితులను గౌరవిస్తూ ఆడాలన్న విషయాన్ని సీనియర్ రిషబ్ పంత్‌కు కూడా గుర్తుచేసేలా తన ఆట సాగింది. జేమీసన్ బౌలింగ్‌లో మిడ్‌వికెట్ బౌండరీ వైపు పుల్ షాట్‌తో సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్టేల్రియా) దేశాల్లో తన తొలి అర్ధశతకం పూర్తి చేసుకున్న జురెల్ స్టాండ్స్‌లో కూర్చున్న తన తండ్రి, కార్గిల్‌లో పాల్గొన్న మాజీ సైనికుడు నేమ్ చంద్‌కు కనిపించేలా ఆర్మీ సెల్యూట్ చేశాడు. అతనికి ఆకాశ్ దీప్ (29) చక్కటి సహకారం అందించాడు. జేమీసన్ బౌలింగ్‌లో హెల్మెట్‌కు రెండుసార్లు బంతి తగిలినా వెరవకుండా ఆడిన ఆకాశ్, బ్యాక్‌ఫుట్ కవర్ డ్రైవ్‌తో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి 8వ వికెట్‌కు 46 పరుగులు జోడించారు.
ఆ తర్వాత నేథన్ స్మిత్ (2/54) బౌలింగ్‌లో కాస్త ఎక్కువగా బౌన్స్ అయిన బంతికి ఆకాశ్ కీపర్ బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆకాశ్ పెవిలియన్‌కు చేరిన తర్వాత పరుగులు చేస్తూనే లోయర్ ఆర్డర్‌ను కాపాడే బాధ్యతను జురెల్ సమర్థంగా నిర్వర్తించాడు. జాకబ్ డఫీ (2/57), స్మిత్ బౌలింగ్‌లో కొట్టిన ైస్టెట్ డ్రైవ్‌లు కనువిందు చేశాయి. ఓవర్లో నాలుగో లేదా ఐదో బంతికి సింగిల్ తీసి, చివరి బ్యాటర్లకు తక్కువ బంతులు ఎదుర్కొనేలా చాకచక్యంగా వ్యవహరించాడు. గుర్నూర్ బ్రార్ (46 బంతుల్లో 10) సహకారంతో 9వ వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. అయితే జేమీసన్ ఇన్‌స్వింగర్‌ను బ్రార్ వదిలేయగా అది వికెట్లను గిరాటేసింది. ఇక, ఆఖరి వికెట్‌కు బుమ్రా (4 నాటౌట్)తో కలిసి మరో 19 పరుగులు జోడించిన జురెల్, చివరి మూడు వికెట్లకు భారత్ 129 పరుగులు రాబట్టడంలో కీలక పాత్ర పోషించాడు. శతకానికి చేరువైన జురెల్, జేమీసన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత ఇన్నింగ్స్
ముగిసింది.
బుమ్రా పంజా.. జైస్వాల్ సూపర్ క్యాచ్
రెండో ఇన్నింగ్స్‌లో కొత్త బంతితో బుమ్రా, కాంబోజ్ బౌలింగ్ ప్రారంభించగా కివీస్ ఓపెనర్లు ఆరంభంలోనే ధాటిగా ఆడారు. బుమ్రా బౌలింగ్‌లో కాన్వే మూడు ఫోర్లు బాది జోరు చూపాడు. దాంతో ఈ మ్యాచ్‌లో బుమ్రా వికెట్ తీయని బంతుల సంఖ్య 292కు చేరింది. తన టెస్ట్ కెరీర్లో ఇదే సుదీర్ఘమైన వికెట్ల నిరీక్షణ. అయితే ఏడో ఓవర్లో షార్ట్ లెంగ్త్ బంతితో కెప్టెన్ టామ్ లాథమ్ (8)ను బుమ్రా ఔట్ చేసి ఈ నిరీక్షణకు తెరదించాడు. ఈ సిరీస్‌లో లాథమ్‌ను బుమ్రా ఔట్ చేయడం ఇది మూడోసారి. ఆ తర్వాత కాన్వే, నికోల్స్ (22) జట్టును 36/1తో టీ బ్రేక్‌కు తీసుకెళ్లారు. విరామం తర్వాత ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌కు దిగాడు. తొలుత కాంబోజ్‌తో కలిసి, ఆపై బుమ్రాతో కలిసి బౌలింగ్ చేసినా వెంటనే వికెట్లు దక్కలేదు.
కాన్వే, నికోల్స్ వేగంగా ఆడుతూ రెండో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. కానీ, నికోల్స్‌ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చిన బుమ్రా ఈ జోడీని విడదీశాడు. బుమ్రా బౌలింగ్‌లో కాన్వే ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ను స్లిప్‌లో రాహుల్ జారవిడవడంతో బంతి బౌండరీకి వెళ్లింది. ఆ తర్వాత రచిన్ తోడుగా నిలకడగా ఆడిన కాన్వే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించిన అతడు సుందర్ బౌలింగ్‌లో గాల్లోకి లేపిన బంతిని షార్ట్ థర్డ్‌మ్యాన్ వద్ద యశస్వి జైస్వాల్ ఒంటిచేత్తో అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ పట్టడంతో భారత్‌కు మూడో వికెట్ దక్కింది. చివర్లో రచిన్, మిచెల్ నాలుగో వికెట్‌కు అజేయంగా 40 పరుగులు జోడించి మరో వికెట్ పడకుండా రోజు ముగించారు.
నాన్నకు సెల్యూట్
క్రికెట్ మైదానంలో ప్రతి మైలురాయికి చేరుకున్నప్పుడు భారత వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్ చేసే ఆర్మీ సెల్యూట్ వెనుక తన తండ్రి నేమ్ చంద్ జురెల్ కార్గిల్ యుద్ధ జ్ఞాపకాలు దాగి ఉన్నాయి. 1999 కార్గిల్ యుద్ధంలో 8వ జాట్ రెజిమెంట్ తరఫున నేమ్ చంద్ ముందుండి పోరాడారు. యుద్ధానికి బయలుదేరే ముందు తనకు ఏదైనా జరిగితే పొదుపు, ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులను ఎలా సర్దుబాటు చేసుకోవాలో వివరిస్తూ భార్యకు లేఖ రాశారు. అప్పటికి ధ్రువ్ ఇంకా పుట్టలేదు. విజయ్ దివస్ ప్రకటించిన తర్వాత కొండల పైనుంచి కిందకు దిగిన తొలి రెజిమెంట్ తమదేనని గుర్తుచేసుకున్న నేమ్ చంద్ 2008లో సైన్యం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు.
చదువు కంటే క్రికెట్‌కే ప్రాధాన్యం ఇచ్చినా ఏ విషయంలోనూ ధ్రువ్‌కు లోటు రాకుండా చూసుకున్నారు. కొడుకు అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పుడు బృందావనంలోని బాంకే బిహారీ దర్శనానికి వెళ్లిన ఆయన ఈసారి మాత్రం ధ్రువ్ పిలుపు మేరకు భార్యతో కలిసి తొలిసారి విదేశీ పర్యటనకు వచ్చారు. మైదానంలో కొడుకు ఆటను ప్రత్యక్షంగా వీక్షించారు. ఒకప్పుడు కార్గిల్ కొండలపై దేశం కోసం నిలిచిన సైనికుడిగా, నేడు క్రికెట్ మైదానంలో దేశం కోసం పోరాడుతున్న కొడుకును చూసి మురిసిపోతున్నారు. దేశం కోసం పోరాడటం అంటే ఏమిటో నేర్పిన ఆ సైనికుడి త్యాగం, క్రమశిక్షణకు ప్రతీకగానే ధ్రువ్ ప్రతిసారీ ఆర్మీ సెల్యూట్‌తో తన తండ్రికి గౌరవం అర్పిస్తున్నాడు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 356 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: 86.1 ఓవర్లలో 246 ఆలౌట్ (జురెల్ 88, జేమీసన్ 4/69); న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 46 ఓవర్లలో 133/3 (కాన్వే 51, రచిన్ 46 బ్యాటింగ్, బుమ్రా 2/34)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

