కాకాలో ఆటోజానీ రిటర్న్స్
టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కాకా’ షూటింగ్ చివరి దశకు చేరుకున్నది. ప్రస్తుతం ఫైనల్ పార్ట్స్ చిత్రీకరిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో ‘కాకా’పై అంచనాలు భారీగా ఉన్నాయి.
టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కాకా’ షూటింగ్ చివరి దశకు చేరుకున్నది. ప్రస్తుతం ఫైనల్ పార్ట్స్ చిత్రీకరిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో ‘కాకా’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలావుంటే.. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై వస్తున్న ఊహాగానాలకు చిరంజీవి స్వయంగా చెక్ పెట్టారు. ముందుగా ప్రకటించినట్టుగానే 2027 జనవరి 13న ‘కాకా’ విడుదల కానున్నట్టు ఆయన తన ఎక్స్ ద్వారా స్పష్టం చేశారు.
సంక్రాంతి రిలీజ్‌ని మరోసారి ధృవీకరిస్తూ మేకర్స్ విడుదల చేసిన ైస్టెలిష్ పోస్టర్ని తన ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ఆటోజానీ గుర్తున్నాడా?.. ఈ సంక్రాంతికి ‘కాకా’తో మీ ముందుకు వస్తున్నాడు. సరికొత్త కోణంలో మీ అందర్నీ ఎంటర్టైన్ చేయడానికి ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాను ఒక మెమొరబుల్ ఎక్స్‌పీరియన్స్‌గా మార్చేందుకు బాబీ, చిత్రబృందం ఎంతో కష్టపడుతున్నారు. జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో కలుద్దాం’ అని చిరంజీవి పోస్ట్‌లో పేర్కొన్నారు. వింటేజ్ యంగ్లుక్తో కనిపిస్తున్న మెగాస్టార్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. అనస్వర రాజన్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథనం: కోన వెంకట్, కె.చక్రవర్తిరెడ్డి, కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సంగీతం: తమన్, నిర్మాత: వెంకట్ కె.నారాయణ , నిర్మాణం: కేవీఎన్ ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

