ఈ వార్తలో నిజమెంత?
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌తో తన నెక్ట్స్ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించిన నాటినుంచీ ఈ సినిమాపై అంచనాలు అంబరాన్ని తాకాయి. ‘ఏవండీ రామారావుగారు’ అనే టైటిల్ కూడా ఈ సినిమాకు ఖరారైనట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌తో తన నెక్ట్స్ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించిన నాటినుంచీ ఈ సినిమాపై అంచనాలు అంబరాన్ని తాకాయి. ‘ఏవండీ రామారావుగారు’ అనే టైటిల్ కూడా ఈ సినిమాకు ఖరారైనట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏఐ జనరేటెడ్ పోస్టర్లు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఇదిలావుంటే తాజాగా ఈ కథపై మరో వార్త కూడా వినిపిస్తున్నది. బలమైన భావోద్వేగాలు, అదిరిపోయే కామెడీ, ఊహించని ట్విస్టులతో ఈ కథను అనిల్ రావిపూడి రాశారట.
ఇందులో మాస్ ఎలివేషన్లు కూడా ఓ రేంజ్లో ఉంటాయట. ఎన్టీఆర్ అభినయ సామర్థ్యాన్నీ, కామెడీ టైమింగ్‌ను, మాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అనిల్ రాసిన ఈ కథ అభిమానులకు విందు భోజనంలా ఉంటుందని ఇన్సైడ్ టాక్. మరో ముఖ్యమైన, ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలో హీరో రవితేజ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు వినికిడి. కేవలం అతిథిగా కాకుండా, కథలో కీలకంగా ఉండేలా రవితేజ పాత్రను డిజైన్ చేశారట అనిల్ రావిపూడి. మరి ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

