పిల్లల డైట్ కాంట్రాక్టర్లకు దోచిపెడ్తున్న సర్కార్
- ఇదీ రేవంత్ ప్రభుత్వం తీరు
- డైట్ చార్జీలు మించి పీఎంయూ ధరలు..రోజూ ఒక్కో విద్యార్థికి రూ.54గా సర్కార్ నిర్ణయం
- ప్రస్తుతం 65కు మించిన వైనం
- భోజనం నాణ్యతకు మంగళం
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థుల కడుపులు కొడుతూ కాంగ్రెస్ సర్కార్ కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నది. తొలుత డైట్ చార్జీలను పెంచిన సర్కార్.. ఇప్పుడు ఆ పేరున గుత్తేదారులకు అప్పనంగా అప్పగిస్తున్నది. సరుకుల ధరలు నిర్ణయించిన వాటికన్నా అధికంగా పెంచి టెండర్లను ఖరారు చేసింది. దీంతో పెంచిన చార్జీలతో విద్యార్థులకు ఫలితమే లేకుండా పోతున్నది. కాంట్రాక్టర్ల బోషాణాలు నిండుతుండగా, విద్యార్థుల కడుపులేమో ఎండుతున్నాయి. మరోవైపు పెరిగిన ధరలను సర్దుబాటు చేసుకోలేక హాస్టళ్ల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు తంటాలు పడుతున్నారు. చేసేదేమీలేక కామన్ డైట్ అమలును సైతం అటకెక్కిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలతోపాటు, సంక్షేమ హాస్ట ళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికీ కామన్ డైట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో అట్టహాసంగా ప్రకటించింది. మెనూ సైతం నిర్ణయించింది. యూనిఫైడ్ వెల్ఫేర్ హాస్టల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (యూడబ్ల్యూహెచ్ఎంఎస్) పోర్టల్‌లో విద్యార్థుల సంఖ్యను ఎంట్రీ చేయగానే, ఏ ప్రమాణాల ప్రకారం ఏయే సరుకులు వాడా లి? ఎంత పరిమాణం ఇవ్వాలి? ఇతర వివరాలన్నీ దానికదే పొందుపరుస్తుంది. ఆ విధంగా 2024లో ప్రభుత్వం డైట్ ధరలను సవరించింది. ఒక్కో విద్యార్థికి సగటున రూ.54.33 అవసరమని నిర్ణయించింది. అ లెక్కన మెస్‌చార్జీలను సైతం పెంచింది. కానీ ప్రస్తుతం పీఎంయూ (ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్) నిర్ణయించిన ఫుడ్ ప్రొవిజన్ ధరలతో పోల్చితే సగటున ఒక్కో విద్యార్థికి రూ.65.03 అవసరమని తేలుతున్నది. ఒక్కో విద్యార్థికి ఇంకా రూ.11.01 లోటు ఏర్పడుతున్నది. అంటే రేవత్ ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచినా ప్రస్తుతం విద్యార్థులకు ఒరిగిందేమీ లేకుండా పోయింది. పెంచిన ధరలు ఫుడ్ ప్రొవిజన్ కాంట్రాక్టర్ల జేబుల్లోకే వెళ్తున్నాయని తేలిపోతున్నది.
93 రకాల సరుకులు.. రూ.763 కోట్లకు అప్పగింత
వంట తయారీకి ఫుడ్ ప్రొవిజన్‌కు సంబంధించిన కిరాణా సామగ్రి కొనుగోలు టెండర్లను ప్రభుత్వమే నిర్వహించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫుడ్ ప్రొవిజన్లో 93 రకాలకు సప్లయ్ టెండర్‌ను నేకాఫ్కు రూ.763 కోట్లకు అప్పగించింది. అవి మార్కెట్ ధరలతో పోల్చితే అధికంగా ఉన్నాయని ఇప్పటికే అనేక ఆరోపణలున్నా యి. గుత్తేదారులకు టెండర్ అప్పగించి, సరుకుల సప్లయ్ ప్రారంభమై నెల తిరుగక ముందే ప్రభుత్వం మళ్లీ ధరలను పెంచినట్టు తెలుస్తున్నది. దీంతో విద్యార్థులకేమో కానీ, గుత్తేదారులకే మేలు చేసేలా సర్కార్ నిర్ణయాలు తీసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం నిర్ణయించిన ఫుడ్ ప్రొవిజన్ రేట్లకు, డైట్ చార్జీలకు ఎక్కడా పొంతన లేకుండా ఉన్నది. తలసరి ఖర్చును సర్దుబాటు చేసుకొనేందుకు మెనూకు ఎగనామం పెట్టి విద్యార్థుల పొట్టలు గొడుతున్నారు. ఫుడ్ప్రొవిజన్లో సరుకుల సరఫరాకు ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో కన్నా అధిక ధరలను వెచ్చిస్తున్నా, సప్లయ్ అవుతున్న సరుకులు మాత్రం పూర్తిగా నాసిరకంగా ఉంటున్నాయని తేలింది. ఇండెంట్లో పెట్టిన ప్రకారం ఒక్క వస్తువునూ సరిగా సప్లయ్ చేయడం లేదని, దీంతో మెనూ అమలు కష్టసాధ్యమవుతున్నదని ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు వాపోతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

