Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అల్లు శిరీష్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు చుట్టూ చర్చ నడుస్తుండగా.. మరోవైపు బన్నీ మాత్రం ఆ విషయాలకు దూరంగా తన వ్యక్తిగత జీవితంలో ఓ ప్రత్యేక సందర్భాన్ని ఆస్వాదిస్తున్నారు. తన భార్య అల్లు స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ చేసిన ప్రత్యేక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ సముద్రతీరంలో ఆమెతో కలిసి దిగిన ఓ రొమాంటిక్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలో ఇద్దరూ తెలుపు రంగు దుస్తుల్లో కనిపిస్తూ.. అందమైన సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపించారు.
ఈ ఫొటోకు అల్లు అర్జున్ ‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’ అంటూ ఆప్యాయంగా క్యాప్షన్ జోడించారు. భార్యపై తనకున్న ప్రేమను మరోసారి ఇలా బహిరంగంగా వ్యక్తం చేయడంతో అభిమానులు ఈ పోస్టును తెగ షేర్ చేస్తున్నారు.ఇటీవల కాలంలో కూడా స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ప్రత్యేకంగా విషెస్ చెబుతూ పోస్టులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా ఆయన అదే ఆప్యాయతను కొనసాగించారు. తాజా ఫొటోను బట్టి అల్లు అర్జున్, స్నేహారెడ్డి కలిసి వెకేషన్‌కు వెళ్లినట్లు అభిమానులు భావిస్తున్నారు. అంతకుముందు స్నేహారెడ్డి కూడా పడవలో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ జంట విహారయాత్రకు సంబంధించిన ఫొటోలు ఇవేననే చర్చ మొదలైంది.
అయితే వారు ఎక్కడ వెకేషన్‌కు వెళ్లారు అనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. సముద్రతీరంలో సూర్యాస్తమయం సమయంలో తీసుకున్న ఈ ఫొటో మాత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, అల్లు అర్జున్, స్నేహారెడ్డి 2011లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో స్నేహారెడ్డి, పిల్లలతో కలిసి అల్లు అర్జున్ పంచుకునే ఫొటోలు తరచూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. సినిమాల విషయానికి వస్తే.. ‘పుష్ప’ సిరీస్ తర్వాత అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి నెలకొంది. దర్శకుడు అట్లీతో కలిసి ఆయన ఓ భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘రాకా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌లో అల్లు అర్జున్ విభిన్నమైన లుక్‌లో కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. సినిమాలో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, రష్మిక మందానా, ఐశ్వర్య లక్ష్మి, మృణాల్ ఠాకూర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.