మెట్రో పరిసరాల్లో సమస్యగా ప్రైవేటు వాహనాల రద్దీ
- సైబరాబాద్ మూవ్స్ ముగింపు కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు
సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): మెట్రో రైల్వే స్టేషన్ల పరిసరాల్లో ప్రైవేటు వాహనాల వినియోగాన్ని తగ్గించి, ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి టీ-హబ్‌లో జరిగిన సైబరాబాద్ మూవ్స్- 2026 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. మెట్రో స్టేషన్ల వద్ద ప్రైవేటు వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం మెట్రో స్టేషన్ల పరిసరాల్లో ప్రైవేటు వాహనాల రద్దీ సమస్యగా మారుతోందని, కార్ పూలింగ్, షేర్డ్ మొబిలిటీ వంటి ప్రత్యామ్నాయ ప్రయాణ విధానాలు ప్రజలు అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ మార్పు సాధించేందుకు పౌరులు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వం, పోలీసు శాఖ సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్ మాట్లాడుతూ..సైబరాబాద్ మూవ్స్ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించిందన్నారు..
ఫుట్ పాత్ల అభివృద్ధే లక్ష్యం
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి. సృజన మాట్లాడుతూ.. ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో 374 కిలోమీటర్ల మేర ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేశామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్యను500 కిలోమీటర్లకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. అనంతరం ఈ సదస్సులో భాగంగా 15 ప్రముఖ కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ మొబిలిటీ అండ్ ససె్టైనబిలిటీ ప్లెడ్జ్‌పై సంతకాలు చేశాయి.
2027 నాటికి ఉద్యోగుల రాకపోకలకు వినియోగించే వాహనాల సంఖ్యను 10 శాతం తగ్గించేందుకు అంగీకరించాయి. ఉద్యోగుల కోసం షేర్డ్ ట్రాన్స్ పోర్ట్, కార్ పూలింగ్ వంటి విధానాలను ప్రోత్సహించనున్నట్లు వెల్లడించాయి. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రతినిధులు, అంతర్జాతీయ రవాణా నిపుణులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా రవాణా రంగానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

