ఎస్సై ప్రాథమిక పరీక్షకు 90.44 శాతం హాజరు
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 275 ఎస్ఐ(సివిల్), తత్సమాన పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 29న విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 335 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించామని పేర్కొన్నారు. మొత్తం 1,60,712మంది అభ్యర్థులకుగాను 1,45,342మంది (90.44 శాతం) పరీక్షకు హాజరైనట్టు వెల్లడించారు. నియామక ప్రక్రియలో తొలిసారిగా ఆధార్ ఫేషియల్ అథెంటికేషన్ విధానాన్ని సమర్థంగా అమలు చేసినట్టు తెలిపారు. ఈ పరీక్ష ప్రాథమిక కీని త్వరలో బోర్డు అధికారిక వెబ్సైట్లో ఉంచుతామని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

