టెంట్ వేస్తుండగా.. కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి
మేడ్చల్, నవంబర్ 29: శుభకార్యం కోసమని ఇంటి ముందు టెంట్ వేస్తుండగా, కరెంట్ షాక్ కొట్టి.. ఇద్దరు మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. ఎల్లంపేట్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తుడుం లింగం కుమారుడు శ్రీకాంత్ కూతురు బారసాల సందర్భంగా ఇంటి ముందు షామియానాలు వేయాలని టెంట్ హౌస్ నిర్వహించే దేవేందర్‌కు ఆర్డర్ ఇచ్చారు.
ఆదివారం ఉదయం దేవేందర్(40) తన వద్ద పని చేసే బాబు(17)తో కలిసి శ్రీకాంత్ ఇంటికి వెళ్లారు. ఇంటి ముందు టెంట్ వేస్తుండగా పై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

