గాయత్రి జోడీ, తన్వీ రన్నరప్‌తో సరి
లక్నో: స్వదేశంలో సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో రెండు టైటిల్స్ గెలవాలన్న భారత్‌కు నిరాశ ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్ పుల్లెల గాయత్రి- ట్రీసా జాలీ, యువ సంచలనం తన్వీ శర్మ ఫైనల్లో ఓడి రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. టోర్నీలో వరుసగా మూడో టైటిల్ గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న టాప్ సీడ్ గ్రాయత్రి-ట్రీసా కల నెరవేరలేదు. మహిళల డబుల్స్ ఫైనల్లో భారత ద్వయం 24-22, 12-21, 19-21తో ఇండోనేషియాకు చెందిన నాలుగో సీడ్ జోడీ ఇస్యనా మీదా – క్వినారా నాస్టిన్ చేతిలో పోరాడి ఓడిపోయింది.
ఉత్కంఠగా సాగిన తొలి గేమ్‌ను గెలిచిన గాయత్రి ద్వయం అదే జోరును కొనసాగించలేకపోయింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్, 17 ఏండ్ల తన్వీ శర్మ సైతం తొలి గేమ్ నెగ్గినా తర్వాత తడబడి 21-11, 12-21, 15-21తో నాలుగో సీడ్ సుపనిద కతేథాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. టైటిల్ చేజార్చుకున్నా బీడబ్ల్యూఎప్ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో తన్వీ టాప్-20లోకి రానుంది. పీవీ సింధు తర్వాత 17 ఏండ్లకే ఈ ఘనత సాధించిన భారత రెండో షట్లర్ గా నిలవనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

