అవ్వాలక్కలు.. చమ్మచక్కలుభలేగా ఉంది వైబే..
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘రియాలిటీ’. దేవిక భట్ కథానాయిక. సుధాకర్ చాగంటి నిర్మాత. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని ‘సంగీత్’ గీతాన్ని ఆదివారం కాకినాడలో నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్లో విడుదల చేశారు. ‘ట్రంకు పెట్టెలో నగలు పెట్టుకొని.. టిప్పుటాపుగా ముస్తాబేసుకొని వచ్చేశా.. ఇట్టాగా వచ్చేశా..’ అంటూసాగే ఈ సంగీత్ సాంగ్‌ని సురేశ్ గంగుల రాయగా, భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు. వేదవతి భాగవతారిణి, కుంచె రఘు, రోహిణి సొర్రాట్, శ్రీకృష్ణ, సాహితి చాగంటి, నల్గొండ నర్సన్న..
ఈ పాటను ఆలపించారు. విజయ్ పొలాకి కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ. సంగీత్ వేడుకల్లో ఉండే అసలైన సరదా, అల్లరిని ఈ పాట ఆవిష్కరించింది. ఓ ఫ్యామిలీ సెలబ్రేషన్‌గా సాగిన ఈ పాటలో కిరణ్ అబ్బవరం, దేవిక భట్‌లతో పాటు పూజిత పొన్నాడ, సాయికుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ కూడా సరదాగా స్టెప్పులేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథులుగా ఏపీ మంత్రి కందుల దుర్గేష్, ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ భరత్‌భూషణ్ పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇంకా ప్రముఖ నిర్మాత సుధాకర్ మిక్కిలినేనితోపాటు చిత్రబృందమంతా మాట్లాడారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

