భారీగా తగ్గిన బ్రిటన్ విద్యార్థి వీసాలు
న్యూఢిల్లీ : బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులకు ఆ దేశం షాక్ ఇచ్చింది. కఠినమైన వీసా నిబంధనల కారణంగా గతేడాదితో పోలిస్తే ఈ విద్యాసంవత్సరం వీసాలు 29 శాతం తగ్గి 69,855కు చేరాయి. అయినప్పటికీ బ్రిటన్‌కు అత్యధికంగా వస్తున్న విద్యార్థుల్లో భారత్ నుంచే 22 శాతం ఉన్నారు. దీంతో పాటు విద్యార్థులు తమ జీవిత భాగస్వామి, పిల్లలను డిపెండెంట్లుగా బ్రిటన్ తీసుకెళ్లడంపైనా ఆంక్షలు విధించగా.. ఇందులోనూ వీసాల జారీ 33 శాతం తగ్గి 13,514కు చేరింది. కొత్త నిబంధన ప్రకారం వీసా తిరస్కరణ రేటు 5 శాతంలోపు ఉండాలి. అడ్మిషన్ అంగీకరించిన వారిలో 95 శాతం కోర్సుల్లో చేరాలి. ఈ ప్రమాణాలు పాటించని వర్సిటీలు విద్యార్థి వీసాలు స్పాన్సర్ చేసే అనుమతి కోల్పోతాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

