సెమీస్‌లో తెలంగాణ పోలీస్ కబడ్డీ జట్టు
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ-ఏ డివిజన్ లీగ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర పోలీస్ జట్టు సెమీఫైనల్ చేరుకుంది. మీర్‌పేట మున్సిపల్ క్రీడా మైదానంలోఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ పోలీస్ టీమ్ 5744తో దక్షిణ మధ్య రైల్వే జట్టును ఓడించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తో తలపడనుంది. మరో సెమీస్‌లో యూనియన్ బ్యాంక్ టీమ్.. దక్షిణ మధ్య రైల్వే జట్టును ఎదుర్కోనుంది. తెలంగాణ పోలీస్ టీమ్ విజయంపై రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని వీరేష్, ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇదే జోరు కొనసాగించి ట్రోఫీ నెగ్గాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

