చూసినవారంతా ప్రశంసిస్తున్నారు
‘మా సినిమాకు మంచి స్పందన వస్తున్నది. ముఖ్యంగా ైక్లెమాక్స్‌లో అందరూ ఎమోషనల్ అవుతున్నారు. మా ప్రమోషన్ కన్నా మా కంటెంట్ ఎక్కువగా మాట్లాడుతున్నది. మహిళలు, పిల్లలకు ఈ సినిమా బాగా కనెక్టయింది’ అంటున్నారు హీరో రజత్ రాఘవ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’. కాజల్, హాసిని సుధీర్ హీరోయిన్లు. శరత్ దర్శకత్వంలో దీపక్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది.
ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు హీరో రజత్ రాఘవ్. కోపంతో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేస్తాయనే చక్కని సందేశాన్ని ఈ సినిమాలో చూపించామని, చూసినవారంతా సినిమాను ప్రశంసిస్తున్నారని, అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్స్ పడుతున్నాయని రజత్ రాఘవ్ తెలిపారు. ‘అద్భుతమైన కథతో దర్శకుడు శరత్ ఈ సినిమాను తెరకెక్కించాడు. నిర్మాత దీపిక రాజీపడకుండా సినిమాను నిర్మించాడు. ఈ సినిమా విజయానికి ప్రధాన కారకులు వారే. ఇదే ప్రొడక్షన్లో మరో సినిమా చేయబోతున్నాను’ అని రజత్ రాఘవ్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

