ఐక్యత, సమైక్యతతోనే అభివృద్ధి
- ఆల్ ఇండియా బ్రాహ్మణ ప్రతినిధులతో గవర్నర్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): సమాజంలో ఐక్యత, సమైక్యతతోనే ఏ వర్గమైనా అభివృద్ధి సాధించగలదని, సమాజంలోని అట్టడుగు స్థాయిలో ఉన్నవారికి ఉన్నత స్థానాల్లో ఉన్నవారు అండగా నిలువాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్శుక్లా అభిలషించారు. కష్టపడి పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలమని పేర్కొన్నారు. ఆదివారం లోక్‌భవన్‌లో తనను మర్యాదపూర్వకంగా కలిసిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ప్రతినిధులకు ఆయన కీలక సూచనలు చేశారు.
బ్రాహ్మణ సంఘ ప్రతినిధులకు ప్రత్యేకంగా తేనీటి విందు ఏర్పాటు చేశారు. వారితో ఆత్మీయంగా ముచ్చటిస్తూ సమాజాభివృద్ధి, ఐక్యత, పరస్పర సహకారం వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. గవర్నర్‌ను కలిసినవారిలో ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్డీ శర్మతోపాటు ద్రోణంరాజు రవికుమార్, మంగపతిరావు, ప్రతిభట్ల లక్ష్మీనారాయణ, నైషధం సత్యనారాయణమూర్తి తదితరులు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

