బంగాళాఖాతంలో బలపడుతున్న ‘అల్పపీడనం’
- తుపాన్‌గా మారేందుకు అనుకూలంగా వాతావరణం
- తుపాన్‌కు ‘కాని’ పేరు సూచించిన మాల్దీవులు
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : అర్నబ్, మురసు, అక్వాన్ తుపానులు ఇప్పటికే ఏపీని అతలాకుతలం చేశాయి. తెలంగాణలో కూడా వర్షాలకు కారణమయ్యాయి. ఈ తుపానుల బీభత్సం నుంచి పూర్తిగా కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది.
సముద్రంలో అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా, ఆతర్వాత వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. అనంతరం తుపానుగా బలపడి డిసెంబర్ 7నాటికి తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తుపాను ఏర్పడితే దానిని ‘కాని’ అని పిలువనున్నట్టు మాల్దీవులు పేరును సూచించింది.
తుపాను ప్రభావంతో ఏపీలోని కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యింది. మరో రెండుమూడు రోజులు రాష్ట్రంలో ఇలాగే వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

