ఏపీ జలదోపిడీని అడ్డుకోవాలి
- విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశం
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): అనుమతుల్లేకుండా నాగార్జునసాగర్ నుంచి ఏపీ కొనసాగిస్తున్న నీళ్ల దోపిడీని కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) తక్షణం అడ్డుకోవాలని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా నీటి తరలింపును చేపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. సమస్య పరిషారానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం లేఖ రాయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టానికి విరుద్ధంగా పల్నాడు వాటర్ గ్రిడ్ స్కీమ్‌ను చేపట్టిందని వివరించారు.
అదేవిధంగా సాగర్ ఎడమ కాలువ రైతాంగం ప్రయోజనాల కోసం అదనపు గేట్లను ఏర్పాటు చేయాలని, ఇతర ప్రత్యామ్నాయ చర్యలను, పరిష్కారమార్గాలను అన్వేషించాలని ప్రభుత్వానికి సూచించారు. ఏపీ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా కేఆర్ఎంబీ పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇకనైనా స్పందించాలని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

