Chennai Super Kings : ఐపీఎల్ 20వ సీజన్ వేలానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) దూకుడు పెంచింది. సుదీర్ఘ కాలం హెడ్‌కోచ్‌గా సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు బైబై చెప్పేసిన సీఎస్కే.. వరసగా కొత్త కోచ్‌లను ప్రకటిస్తోంది. ఇప్పటికే ప్రధాన కోచ్‌గా భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ (Zaheer Khan)ఎంపికవ్వగా.. తాజాగా బౌలింగ్ కోచ్‌ను దాదాపు ఖరారు చేసింది ఫ్రాంచైజీ. టీమిండియా మాజీ పేసర్ మోహిత్ శర్మ (Mohit Sharma)కు తమ బౌలర్లను సానబెట్టే బాధ్యత అప్పగించనుందని సమాచారం.
ఐపీఎల్ మేటి జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌ల నియామకాల్లో వేగం చూపిస్తోంది. ఇరవయ్యో సీజన్ వేలానికి ముందే కోచింగ్ సిబ్బంది ఎంపిక పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్న సీఎస్కే.. ధోనీ సలహాలతో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో వెటరన్ జహీర్ ఖాన్‌ను హెడ్‌కోచ్‌గా తీసుకుంది. ఇప్పుడు బౌలింగ్ కోచ్ వేటను ముగిస్తూ.. ఐపీఎల్లో సుదీర్ఘ అనుభవజ్ఞుడైన మోహిత్ శర్మను ఖరారు చేయనుంది చెన్నై.
Chennai Super Kings CEO confirms Mohit Sharma’s appointment as the team’s bowling coach 💛#Cricket #CSK #IPL2027 pic.twitter.com/BBCpkpkCXZ
— Sportskeeda (@Sportskeeda) September 29, 2026
ఈ విషయంపై సీఈవో కాశీ విశ్వనాథన్ మీడియాతో మాట్లాడుతూ తమ కోచింగ్ సిబ్బందిలో మోహిత్ భాగం కానున్నాడనే ఈ విషయాన్ని వెల్లడించాడు… ‘మా హెడ్‌కోచ్ జహీర్ ఖాన్ సహాయక సిబ్బందిని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. అతడు మోహిత్ శర్మను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేశాడు’ అని ఆయన పేర్కొన్నాడు. అయితే.. అధికారికంగా మాత్రం మోహిత్ పేరు ప్రకటించలేదు. త్వరలోనే ఎరిక్ సిమన్స్ స్థానంలో నూతన బౌలింగ్ కోచ్‌గా మోహిత్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది.
సీఎస్కే తదుపరి బౌలింగ్ కోచ్‌గా దాదాపు ఖరారైన మోహిత్‌ను సంప్రదించగా.. మళ్లీ చెన్నై గూటికి చేరితే తాను చాలా సంతోషిస్తానని తెలిపాడు. ‘సీఎస్కేలో కుటుంబంలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఆఫర్ రాగానే ఇంకేమీ ఆలోచించలేదు. వెంటనే ఎస్ అని చెప్పేశా. నాకు సీఎస్కే చాలా ప్రత్యేకం. ధోనీ ఉన్నప్పుడు అంతా మంచిగానే జరిగింది. ఇప్పుడు మరోసారి చెన్నై గూటికి చేరడానికి ఆతృతతో ఉన్నా. ఈసారి అందరం కలిసి గొప్ప ఫలితాలు సాధిస్తాం. సీఎస్కే అభిమానులారా.. మిమ్మల్ని త్వరలోనే కలుస్తా’ అని మోహిత్ పేర్కొన్నాడు.
🚨 MOHIT SHARMA AFTER CSK NEW BOWLING COACH 🚨
Mohit Sharma Said 🗣️:
“I’m really happy to be joining the CSK family again. When I received the first offer, I didn’t think twice about it. I immediately said yes. CSK is very special to me, and wherever Mahi Bhai is, good things… pic.twitter.com/llV0yoqL5i
— lndian Sports Network (@IS_Netwrk29) September 29, 2026
ఐపీఎల్లో చెన్నై తరపున డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా విజయవంతమైన మోహిత్.. భారత్ తరఫున 8 టీ20లు ఆడాడు. 2013 నుంచి 2015 వరకూ.. ఆపై 2019లో సీఎస్కేకు వచ్చేశాడు మోహిత్. ధోనీ కెప్టెన్సీలో రాటుదేలిన అతడు.. 2014లో 23 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.