TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
క్షయవ్యాధి (టీబీ) చికిత్స పూర్తయి పరీక్షల్లో వ్యాధి నయమైనట్లు తేలినా కొందరిలో దగ్గు, ఆయాసం, ఛాతీలో బిగుతుగా అనిపించడం వంటి సమస్యలు కొనసాగుతుంటాయి. ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు లేదా కొద్దిదూరం నడిచినప్పుడే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించడం చికిత్స విఫలమైందని అర్థం కాదు.
TB | క్షయవ్యాధి (టీబీ) చికిత్స పూర్తయి పరీక్షల్లో వ్యాధి నయమైనట్లు తేలినా కొందరిలో దగ్గు, ఆయాసం, ఛాతీలో బిగుతుగా అనిపించడం వంటి సమస్యలు కొనసాగుతుంటాయి. ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు లేదా కొద్దిదూరం నడిచినప్పుడే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించడం చికిత్స విఫలమైందని అర్థం కాదు. టీబీ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల్లో వాపు, కణజాల నష్టానికి కారణమవుతుంది. వ్యాధితో పోరాడి కోలుకునే సమయంలో దెబ్బతిన్న కణజాలం తిరిగి బాగుపడినా, కొన్ని సందర్భాల్లో అక్కడ మచ్చలు ఏర్పడి శాశ్వత మార్పులకు దారితీస్తాయి. అందువల్ల ఇన్ఫెక్షన్ తగ్గిన వెంటనే ఊపిరితిత్తులు గతంలో మాదిరిగా పనిచేయవు.
ఊపిరితిత్తుల్లో మచ్చలు..
టీబీ తర్వాత ఊపిరితిత్తుల్లో ఏర్పడే మచ్చలను వైద్య పరిభాషలో పల్మనరీ ఫైబ్రోసిస్ అంటారు. దీనివల్ల ఊపిరితిత్తుల సహజమైన సాగేగుణం తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అవి ప్రతి శ్వాసతో విస్తరించి, తిరిగి ముడుచుకుంటాయి. కానీ మచ్చలు ఏర్పడిన ప్రాంతాలు గట్టిపడడంతో ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది. మరికొందరిలో బ్రాంకియెక్టాసిస్ అనే సమస్య వస్తుంది. ఇందులో ఊపిరితిత్తుల్లోని పెద్ద శ్వాసనాళాలు శాశ్వతంగా వెడల్పుగా, మందంగా మారి దెబ్బతింటాయి. ఫలితంగా శ్లేష్మం నాళాల్లో పేరుకుపోయి దీర్ఘకాలిక దగ్గు, కఫం, పదేపదే ఛాతీ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..
టీబీ మందుల చికిత్స పూర్తయిన తర్వాత కొన్ని వారాలు లేదా నెలల పాటు అలసట, స్వల్ప శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉంటాయి. అయితే రోజువారీ పనులు చేసేటప్పుడు కూడా ఆయాసం రావడం, నెలల తరబడి కఫంతో కూడిన దగ్గు కొనసాగడం, తరచూ ఛాతీ ఇన్ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించి స్పైరోమెట్రీ అనే శ్వాస పరీక్ష చేయించుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా ఊపిరితిత్తులు ఎంత గాలిని నిల్వ చేసుకోగలవు, ఎంత వేగంగా బయటకు వదలగలవు అనే విషయాలు తెలుస్తాయి.
ఏయే జాగ్రత్తలు పాటించాలి..
టీబీ తర్వాత కోలుకునే ప్రక్రియలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల పర్యవేక్షణలో శ్వాస వ్యాయామాలు, తగిన శారీరక శిక్షణ తీసుకోవడం వల్ల శ్వాస సామర్థ్యం, శరీర దారుఢ్యం మెరుగుపడతాయి. ప్రొటీన్లు, తాజా పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి. ఇంటి లోపలి వాయు కాలుష్యం, ఇతరులు తాగే పొగ, కట్టెల పొయ్యిల పొగకు దూరంగా ఉండాలి. ధూమపానం చేసేవారు దాన్ని పూర్తిగా మానేయడం అత్యంత కీలకం. న్యుమోకాకల్, ప్రతి ఏడాది తీసుకునే ఇన్ఫ్లుయెంజా టీకాలు ఇతర ఇన్ఫెక్షన్ల ముప్పును తగ్గించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే టీబీ తర్వాత కూడా చురుకైన, ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

